
Naga Chaitanya : శోభితతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంటు.. మరి పెళ్లి ఎప్పుడు..!
Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.కొన్నేళ్ల క్రితమే సమంత రూత్ ప్రభును అక్కినేని నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడిపోవడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని హీరో మరో హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు అది నిజం అయ్యేలా కనిపిస్తుంది.నాగ చైతన్య – తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు చాన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమే అంటూ కొన్ని వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం వార్త వైరల్ అవుతోంది.
సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత అక్కినేని నాగ చైతన్య ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే శోభితతోనే అతడు ఏడు అడుగులు నడుస్తాడని టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యారట. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. త్వరలోనే శోభిత, చైతన్య వివాహం చేసుకోబోతున్నారట. చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉంటోన్న నాగ చైతన్య.. శోభిత ధూళిపాళ్లతో నడుపుతున్న లవ్ స్టోరీ గురించి తన పేరెంట్స్‌కు చెప్పినట్లు తాజాగా ఒక సమాచారం వైరల్ అవుతోంది. అలాగే, ఆ హీరోయిన్ కూడా తన వాళ్లను ఒప్పించిందట. దీంతో వీళ్లిద్దరి పెళ్లికి రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు (గురువారం) వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరగనుందట.
Naga Chaitanya : శోభితతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంటు.. మరి పెళ్లి ఎప్పుడు..!
తాజాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ వార్తలే కనిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఈరోజే (ఆగస్టు 8) నిశ్చితార్థం జరగబోతుందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కానీ దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోను నాగార్జున త్వరలోనే సోషల్ మీడియాలో పంచుకుంటారంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ప్రకటన చేస్తుందంటున్నారు. మరోవైపు గతంలో చాలా సార్లు తాను ఏ యాక్టర్‌తోనూ తాను డేటింగ్ చేయనని శోభిత పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారతారని.. వారి అభిరుచులు కూడా మారుతుంటాయని చెప్పుకొచ్చింది.
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
This website uses cookies.