Home » Entertainment » Naga Chaitanya Who Opened Before Samantha
Entertainment

Samantha : తప్పు చేశా అంటూ సమంత ముందు ఓపెన్ అయిన నాగ చైతన్య..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 3, 2023, 11:00 am
Advertisement

Samantha : 2017లో ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య… సమంత నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ కి గురి చేసింది. అసలు ఏ కారణంగా వీరిద్దరూ విడిపోయారు అన్నది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న గానే మిగిలిపోయింది. వీరిద్దరి మధ్య విడిపోవడానికి కారణం ఎవరు..? ఏంటి..? అన్నది ఎవరికీ తెలియదు. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట లాక్ డౌన్ లో కూడా… సోషల్ మీడియాలో పలు పోస్టుల ద్వారా ఎంతగానో అలరించారు. అనుకోకుండా 2021 అక్టోబర్ నెలలో ఇద్దరు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అప్పటినుండి నాగచైతన్య…

Advertisement

Naga Chaitanya who opened before Samantha

సమంత ఎవరికి వారు.. తమ కెరియర్ పరంగా బిజీ అయిపోయారు. సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ సినిమాలు చేసి “పుష్ప” లో ఐటమ్ సాంగ్ చేసి… అదరగొట్టింది. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ నెలలో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురై.. హాస్పిటల్ పాలయ్యింది. ఇదిలా ఉంటే ఇటీవల నాగచైతన్య.. తన కొత్త సినిమా “కస్టడీ” కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. వెంకట ప్రభు దర్శకత్వంలో జరిగే సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. నాగచైతన్య కనిపిస్తున్నారు. అయితే వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విడాకులపై పరోక్షంగా చైతన్య స్పందించారు.

Advertisement

మీ జీవితంలో పశ్చాతాపం పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా..?” అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదు అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు ప్రతిదీ ఒక పాటమే అంటూ కామెంట్ చేశాడు . ఆ వెంటనే డివర్స్ విషయంలో కానీ లేక ఏదైనా విషయంలో కానీ మీరు లైఫ్ లో బాధపడ్డారా అని అడిగినప్పుడు చైతు మాట్లాడుతూ..” సినిమాలో పరంగా రెండు మూడు సినిమాల విషయంలో నేను చాలా బాధపడ్డాను..రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను ” అదే తప్పిస్తే మరి ఏ విషయంలో నేను తప్పు చేయలేదు అంటూ ఓపెన్ గా చై తెలియజేయడం జరిగింది. నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి