Home » Entertainment » Naga Chaithanya Sai Pallavis Love Story Is Going To Release On 14th February
Entertainment

నాగ చైతన్య – సాయి పల్లవి ల లవ్ స్టోరీ 14 ఫిబ్రవరి న రిలీజ్ .?

Authored By
vamana sai
The Telugu News | Updated on: December 30, 2020, 1:24 pm
Advertisement

నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య – సాయి పల్లవి మొదటిసారి జత కట్టడం తో ఫ్రెష్ కాంబినేషన్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది. పైగా లవ్ స్టోరీ అన్న టైటిల్ కూడా యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. క్లాస్ చిత్రాల డైరెక్టర్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అంతేకాదు ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగాస్వామిగా ఉన్నాడు. ఇక శేఖర్ కమ్ముల – నాగ చైతన్య కాంబినేషన్ ఫ్రెష్ కాంబినేషన్ కావడం అలాగే శేఖర్ కమ్ముల – సాయి పల్లవి కాంబోలో ఇప్పటికే ఫిదా సినిమా వచ్చి సూపర్ హిట్ గా నిలవడం తో ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి.

Advertisement

మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న లవ్ స్టోరీ కావడం కూడా ప్రేక్షకుల్లో బజ్ క్రియేటవడానికి మరొక ముఖ్య కారణం. ఇక శేఖర్ కమ్ముల సినిమాలన్ని యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అదే తరహాలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు.. అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రొమాంటిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన లవ్ స్టోరీ నాగ చైతన్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ లా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా చెప్పుకుంటున్నారు.

Advertisement

 

Advertisement

కాగా ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోందట. అయితే వాస్తవంగా లవ్ స్టోరీ సినిమా 2021 సంక్రాంతి పండుగ సీజన్ లో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కాని లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. యూత్ ని టార్గెట్ చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ఆ డేట్ అయితే బావుటుందని దాదాపు అదే డేట్ రిలీజ్ కి ఫిక్స చేయబోతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో త్వరలో లవ్ స్టోరీ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి