Varun Tej Marriage : కొడుకు పెళ్లి ని బిజినెస్ గా మార్చుకున్న నాగబాబు.. ఎన్ని కోట్లో తెలుసా..??
Varun Tej Marriage : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా నటీ లావణ్య త్రిపాఠి తో జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వరుణ్ – లావణ్య కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం ఇటలీలో కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిగింది. ఇక ఈ పెళ్లి కోసం నాగబాబు భారీ స్థాయిలో ఖర్చు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి కానీ ఎక్కడా కూడా పెళ్లికి సంబంధించిన వీడియోలు బయటికి రావడం లేదు.
కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి సందడి చేసిన వీడియోల కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే గతంలో నాగబాబు తన కుమార్తె నిహారిక పెళ్లి వీడియోను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో బాగా ట్రెండింగ్ లో ఉంది. నిహారిక పెళ్లి వీడియోను షేర్ చేసినట్లుగానే నాగబాబు తన కొడుకు పెళ్లి వీడియోను కూడా షేర్ చేస్తాడని అందరూ భావిస్తున్నారు. కానీ ఈయన మాత్రం తన కుమారుడి పెళ్లి వీడియోని యూట్యూబ్లో చానల్లో అప్లోడ్ చేయలేదని ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఓటిటి సంస్థలు స్టార్ సెలబ్రిటీలు పెళ్లి వీడియోలను భారీగా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల పెళ్లి వీడియోలు భారీ ధరలకు కొనుగోలు చేశారు. తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో కూడా నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఈ పెళ్లి వీడియోను తమకు ఇవ్వడానికి నెట్ఫ్లిక్స్ వారు ఏకంగా 8 కోట్లు ఆఫర్ చేశారని సమాచారం. ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వీడియో చూడాలంటే నెట్ఫ్లిక్స్ ప్రసారం చేసేదాకా వేచి చూడాల్సిందే. ఇక నెట్ఫ్లిక్స్ వారు గతంలో నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి వీడియోను భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ కొన్ని నిబంధనలను నయనతార ఉల్లంఘించడంతో వీరి మధ్య కాంట్రాక్టర్ రద్దు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
This website uses cookies.