Home » Entertainment » Nagarjuna About On Naga Chaitanya Samantha Divorce
Entertainment

Nagarjuna : నాగచైతన్య, సమంత విడాకులు .. నాగార్జున ఏమ‌న్నాడంటే..?

Authored By
praveen T
The Telugu News | Published on: October 2, 2021, 7:04 pm
Advertisement

Nagarjuna : గత కొద్ది రోజుల నుంచి నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. నాగచైతన్య, సమంత తాము విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఈ విషయమై టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున స్పందించారు.

Advertisement

Nagarjuna  బరువెక్కిన హృదయంతో చెబుతున్న..  నాగార్జున

సామ్-చై విడాకులు విషయం తెలుసుకుని తన హృదయం బరువెక్కిందని తెలిపారు నాగార్జున. సమంత-చైతన్య మధ్య ఏం జరిగిందో అది చాలా దురదృష్టకరమని, భార్యా భర్తల మధ్య జరిగేది వారి వ్యక్తిగతమని నాగ్ చెప్పారు. సామ్-చైతన్య ఇద్దరు తన మనసుకు దగ్గరివారేనని, సామ్‌తో గడిపిన క్షణాలు తన కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపాడు.

Advertisement

Samantha demanding crores of alimony akkineni family

ఇకపోతే ఆమె ఎప్పటికీ తమకు ప్రియమైన వ్యక్తేనని, వారిద్దరికీ ఆ దేవుడు ఆత్మస్థైర్యం ప్రసాదించాలని తాను కోరుకుంటున్నానని నాగ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. కోడలు సమంత తన కొడుకు నాగచైతన్యకు విడాకులు ఇవ్వబోతున్నదని నాగార్జున బాధపడుతున్నట్లు ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతున్నదని నెటిజన్లు అంటున్నారు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి