
Nagarjuna tweet on Nagachaitanya and samantha matter
Nagarjuna : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన సంగతి అందరికీ విదితమే. అయితే, తాజాగా ఈ డైవోర్స్ గురించి నాగచైతన్య తండ్రి నాగార్జున స్పందించినట్లు సోషల్ మీడియాలో, మీడియాలో కొన్ని వార్తలు ప్రసారమవుతున్నాయి. కాగా, అవన్నీ తప్పుడు వార్తలని పేర్కొన్నాడు. చెత్త వార్తలు రాయొద్దని నాగార్జున రిక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా నాగార్జున ట్వీట్ చేశాడు. నాగచైతన్య, సమంత డైవోర్స్ నాగార్జున ఓ చానల్‌తో మాట్లాడినట్లు వార్తలు ప్రసారమయ్యాయి. ఆ వార్తల ప్రకారం.. సమంతనే మొదట నాగాచైతన్యని డైవోర్స్ అడిగిందని, ఈ విషయం నాగార్జునకు నాగచైతన్య చెప్పాడని సమాచారం.
ఈ క్రమంలోనే ఈ విషయం చెప్పే క్రమంలో నాగచైతన్య అక్కినేని ఫ్యామిలీ గురించి తన తండ్రి గురించి ఆలోచించాడని వార్తలు ప్రసారం చేస్తున్నారు. అయితే, ఇలా ప్రసారమవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నాగార్జున క్లారిటీనిచ్చాడు.తాను నాగచైతన్య, సమంత డైవోర్స్ గురించి ఎటువంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదని, కానీ, కొందరూ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న వార్తలో నిజం లేదని నాగార్జున క్లారిటీనిచ్చారు. ఈ క్రమంలోనే తాను మీడియా ప్రతినిధులకు తప్పుడు వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నానని నాగార్జున కోరారు. రూమర్స్‌ను వార్తలుగా ప్రచారం చేయొద్దని పేర్కొన్నారు.
Nagarjuna tweet on Nagachaitanya and samantha matte
గివ్ న్యూస్ నాట్ రూమర్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను నాగార్జున ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంతపైన తప్పుడు ప్రచారం జరినపుడు మాట్లాడని మీరు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే నాగచైతన్య, సమంత ఇద్దరూ కూడా డైవోర్స్ తర్వాత ఎవరి ప్రొఫెషనల్ లైఫ్‌లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. తండ్రీ తనయులు నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ ఫిల్మ్ సంక్రాంతి కానుకగా విడుదలై దూసుకుపోతున్నది.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.