Namrata Cute looks viral
Namrata : సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీ.గోపాల్ దర్శకత్వం వహించిన వంశీ సినిమాలో మహేశ్ బాబు, నమ్రత నటించి మెప్పించారు. ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని ఏళ్లుగా డేటింగ్ తో ఉంటూ ఆతర్వాత పెద్దల సమక్షంలో 2005లో ఒక్కటయ్యారు. విషయం ఏమిటంటే నమ్రత మహేశ్ బాబు కంటే మూడేళ్లు వయసులో పెద్దది. వీరికి కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితార ఉన్నారు.
నమ్రత మహేశ్ బాబు సినిమాలకు సంబంధించి పబ్లిసిటీ ఇతర వ్యవహారాలను చూసుకుంటుంది.అయితే ముంబైలో జన్మించిన నమ్రత సినిమాల్లో రాకముందు మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 1993లో నమ్రత మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్‌గా ఎంపికైంది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. హిందీలో వాస్తవ్ సినిమాతో ఫామ్లోకి వచ్చారు. హిందీ, మలయాళం, మరాఠీ, తెలుగు భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో నటించారు. తెలుగులో వంశీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
Namrata Cute looks viral
సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ మూవీలో నటించడం విశేషం. ఆ తర్వాత మహేష్ బాబు, పిల్లలతో కలిసి ఆ మధ్య ఓ యాడ్‌లో నటించింది. గతేడాది మహేష్ బాబు, నమ్రత ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం కలిసి స్టిల్స్ ఇచ్చారు.నమ్రత మహేశ్ బాబు సినిమా వ్యవహారాలగురించి చూస్తూనే సోషల్ మీడియాలో కూడడా ఆక్టీవ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు మహేశ్ సినిమాల అప్డేట్స్, ఫ్యామిలీ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. కూతురు సితార, గౌతమ్ కృష్ణ ఫొటోస్ వీడియోస్ అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం నమ్రత ఓ ఫొటో పోస్ట చేయగా వైరల్ అవుతోంది.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.