Home » Entertainment » Navya Swamy Fires On Ravikrishna On Asking Hug To Shraddha Das In Dhee Promo
Entertainment

Navya Swamy : ఏంటి ఇలా తయారయ్యావ్?.. రవికృష్ణ పై నవ్యస్వామి ఆగ్రహం

Authored By
aruna
The Telugu News | Published on: August 5, 2022, 7:40 pm
Advertisement

Navya Swamy : రవికృష్ణ నవ్యస్వామిల జంటకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఇప్పుడు టాప్ ట్రెండ్‌లో ఉన్నారు. ఆమె కథ సీరియల్‌తో వీరి ప్రయాణం మొదలైంది. అందులో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి జనాలు బాగానే అట్రాక్ట్ అయ్యారు. ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ జంట మెప్పించింది. దీంతో ఈ ఇద్దరి మీద ఎన్నో రకాల రూమర్లు మొదలయ్యాయి. నవ్యస్వామి, రవికృష్ణల ప్రేమ, పెళ్లి మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. అయితే వాటిని వీరిద్దరూ ఖండిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం వీరి వ్యవహారం కాస్త తేడాగా ఉంటుంది. నవ్యస్వామి పెట్టే ఫోటోలకు, ఆమె షేర్ చేసే పోస్టులకు రవికృష్ణ వెంటనే రియాక్ట్ అవుతుంటాడు.

Advertisement

ప్రతీ పోస్టుకు ఒకేలా రియాక్ట్ అవుతుంటాడు. మూడు లవ్ సింబల్స్‌ను షేర్ చేస్తుంటాడు. అలా రవికృష్ణ కామెంట్లతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తుంటాయి. ఇక ఈ ఇద్దరూ ఢీ షోలో జోడిగా కనిపిస్తుంటారు. ఈ ఇద్దరి మీద ఆది వేసే పంచులు కూడా అలానే ఉంటాయి. నవ్యస్వామి మీద అయితే ఆది దారుణంగా పంచులు వేస్తుంటాడు. తాజాగా వదిలిన ఢీ ప్రోమోలో ఆది రెచ్చిపోయాడు. చిన్న పిల్లాడికి శ్రద్దా దాస్ ముద్దు పెట్టడంతో ఆది హర్ట్ అవుతాడు. నువ్ కూడా రా నీకు కూడా ఇస్తా అని అనడంతో.. ఆది పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆదిని అడుకునేందుకు రవికృష్ణ వెళ్తుంటాడు. నాకు ముందు ఇవ్వండి అని వెంటపడతాడు. ఇక ఆదికి కోపం వస్తుంది..

Navya Swamy Fires on Ravikrishna on Asking Hug to Shraddha Das in Dhee Promo

Advertisement

ఈ విషయంలో ఎవరైనా అడ్డు పడితే శవాలు లెగుస్తాయ్ అని వార్నింగ్ ఇస్తాడు. నాకు ముందు హగ్ ఇవ్వండి అని రవి అంటుంటే.. అవతలి నుంచి నవ్యస్వామి ఫైర్ అవుతుంటుంది. ఏంటి ఇలా తయారయ్యావ్ అని నవ్యస్వామి అంటుంది. ఓ ఐదు నిమిషాలు ఆగు వస్తాను అని అంటాడు రవి. నువ్ ఎలా తయారయ్ వచ్చావో నీకు తెలుసా? నువ్ అలా ఉన్నావ్ అనే వీడు ఇలా వచ్చాడంటూ ఆది కామెంట్లు చేస్తాడు. మొత్తానికి రవికృష్ణ నవ్యస్వామి జోడిని మాత్రం ఆది ఎప్పుడూ ఇలానే ఏదో ఒక కౌంటర్లతో ఆడుకుంటాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి