Nayanatara : సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పటికే రెండుసార్లు ప్రేమలో పడి దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముందు తమిళ హీరో శింబుతో చాలా ఏళ్ళు ప్రేమాయణం సాగించింది నయనతార. ఇక ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారని దేశమంతా ప్రచారం జరిగింది. కానీ చివరికి ఇద్దరు విడిపోయారు. ఎందుకు విడిపోయారో కారణాలు తెలియనప్పటికి ఇలా ఎందుకు జరిగిందో అని నయనతార అభిమానులు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ప్రభుదేవాకి ఆల్రెడీ పెళ్ళైంది.
nayanatara-lover vignesh shivan says about delay of marriage
వీరిద్దరు ఎలా ప్రేమలో పడ్డారో అని చాలామందికి అర్థం కాలేదు. సరే ఇద్దరు పెళ్ళి చేసుకుంటారనుకుంటే ఇది కూడా మధ్యలోనే మంగళం పాడారు. ఇలా రెండు సార్లు లవ్ బ్రేకప్ అయినా కూడా నయనతార కెరీర్ మీద ఆ ప్రభావం ఏమాత్రం పడలేదు. ఇటు తెలుగు అటు తమిళ సినిమాలలో వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. తను చేస్తూనే ఉంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రజనీకాంత్, అజిత్ లాంటి సీనియర్ హీరోలకి మంచి పేయిర్‌గా భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇంత బిజీగా ఉన్న నయనతార మళ్ళీ ప్రేమలో పడింది. ఇది కాస్త అందరికీ షాకింగ్ విషయమే అయింది.
ఏదేమైనా దర్శకుడు విగ్నేష్ శివన్‌తో గత కొన్నేళ్ళుగా నయనతార ప్రేమలో ఉంది. అందరూ కూడా వీరిద్దరు పెళ్ళి చేసుకుంటారా లేక మళ్ళీ బ్రేకప్ అవుతుందా అని కామెంట్స్ చేశారు. కానీ వీరిది విడిపోయో బంధం కాదని ఇప్పటికే చాలా సందర్భాలలో ప్రూవ్ చేశారు. కాగా ఈ మధ్య నయన్ మీద ఉన్న ప్రేమను ఆమె కాబోయే భర్త బాగా బయటకు చూపిస్తున్నాడు. ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో తన సంతోషాలను పంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ అభిమాని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని అడిగాడు. ప్రస్తుతం మా దగ్గర పెళ్ళి చేసుకునేంత డబ్బు లేదు. దానిని సంపాదించుకునే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఇది సరదా సమాధనమే అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.