Nayanthara And vignesh shivan facing problems after marriage
Nayanthara: సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ఏ జంట అయిన సరదాగా సంతోషంగా ఉంటారు. పెళ్లి తర్వాత హనీమూన్‌కి వెళ్లడం అక్కడ సరదాగా గడపడం, ఓ నెల రోజులపాటు షికార్లు తిరగడం వంటివి చేస్తూ హ్యపీగా గడుపుతుంటారు. అయితే నయనతార- విఘ్నేష్ శివన్‌లకి పెళ్లైన తర్వాతి రోజు నుండి కష్టాలు మొదలయ్యాయి. ఒకటి అయిపోయిందని అనుకుంటున్న సమయంలో మరొకటి వస్తుంది. తాజాగా రూ. 25 కోట్లను తిరిగి చెల్లించాలని నెట్ ఫ్లిక్స్ ఈ జంటకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి అసలు ఈ వివాదం ఏంటనేది తెలియాలంటే వీడియో చూడాల్సిందే..!
అందాల నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత ఇటీవలే ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్- షారూక్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ప్యాకేజీ కి కొనుగోలు చేసింది. ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తనదైన విజన్ తో డాక్యుమెంటరీగా తెరకెక్కించారు. అనుకున్న విధంగానే షూట్ చేయడం కూడా జరిగింది.
Nayanthara And vignesh shivan facing problems after marriage
కాగా సడెన్‌గా నెట్ ఫ్లిక్ సంస్థ నయన్ విఘ్నేష్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని బిగ్ షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.ఒప్పందం ప్రకారం నయన్, విగ్నేష్‌ల పెళ్లి ఫోటోలను బయటకు రాకుండా చూసుకోవాలట. పెళ్లి జరిగి నెల రోజులు కూడా పూర్తికాకుండానే, పెళ్లికి సంబంధించి కీలకమైన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా.. పర్మిషన్ అడగకుండా పెళ్లి ఫోటోలను లీక్ చేశారని నెట్ ఫ్లిక్స్ సంస్థ వీడియో టెలికాస్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందని తాజా టాక్ నడుస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ సంస్థ డీల్ క్యాన్సల్ రద్దు చేసుకోవడంతో..
పెళ్లి కోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని, అంతేకాదు ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న రూ. 25 కోట్లను తిరిగి చెల్లించాలని నెట్ ఫ్లిక్స్ ఈ జంటకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి ఈవెంట్ ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తనదైన విజన్ తో డాక్యుమెంటరీగా తెరకెక్కించారు. ఈ డాక్యు సినిమాని త్వరలోనే నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనుంది.ఇంకా పేరు పెట్టని ఈ డాక్యు సినిమాలో నయనతార – విఘ్నేష్ ల ప్రేమకథను అందంగా చూపించనున్నారు. జూన్ 9న తమిళనాడు- మహాబలిపురంలోని ఒక పాపులర్ రిసార్ట్ లో వివాహంతో ముగిసే ఈ వీడియోలో రియల్ ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
Nayanthara And vignesh shivan facing problems after marriage
స్క్రిప్ట్ లేని కంటెంట్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది అభిమానులకు అందించడంలో మా ప్రత్యేకత వేరు. దేశవిదేశాల్లో ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే శక్తి మాకు ఉంది. అందరికీ ఈ డాక్యు సినిమా అందుబాటులోకి తెస్తున్నామని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు వెల్లడించారు. దాదాపు 20 సంవత్సరాల కెరీర్ లో నయనతార రియల్ సూపర్ స్టార్. మా అద్భుతమైన సృజనాత్మక భాగస్వాములు దర్శకుడు గౌతమ్ మీనన్ – రౌడీ పిక్చర్స్ కి ధన్యవాదాలు. విఘ్నేష్ తో వివాహానికి దారితీసిన నయనతార ప్రయాణాన్ని ఎట్టకేలకు సినిమాగా వీక్షించేందుకు వేచి ఉండలేం.. అని నెట్ ఫ్లిక్స్ అధినేతలు గతంలో ప్రకటించారు. కాని ఇప్పుడు ఈ వివాదంతో ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది వేచి చూడాలి.
ఈ జంట రీసెంట్‌గా థాయ్ లాండ్‌కు హనీమూన్‌కు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అది అలా ఉంటే నయన్ అప్పుడే భర్తకు బై బై చెప్పి.. షూటింగ్‌లకు మళ్ళీ సిద్దం అయ్యింది. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి గాడా ఫాదర్‌తో పాటు హిందీలో అట్లీ దర్శకత్వంలో వస్తున్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’లో కీలకపాత్రలో నటిస్తున్నారు. నయనతార బిజినెస్ లోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. బ్యూటీ ప్రాడక్ట్స్ బిజినెస్ ను ప్రారంభించింది నయనతార. ఆమె ‘ది లిప్ బామ్ కంపెనీ’ పేరుతో రీటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్ తో కలిసి ఈ బిజినెస్ ను ఆమె ప్రారంభించింది.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.