nayanthara ready to romance with movie
Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తుంది. సినిమాల కన్నా తన పర్సనల్ విషయాలతో హాట్ టాపిక్‌గా మారుతుంది. కొద్ది రోజులుగా నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో చెట్టాపట్టాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విగ్నేష్ -నయనతార రహస్య వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది. అందుకు కారణం నయనతార నుదుటిపైన కుంకుమ పెట్టుకోవడమే. పేరుకు ప్రేమికులైనా భార్యాభర్తలకు మించిన అనుబంధం వీరి మధ్య కొనసాగుతుంది. కాబట్టి రహస్య వివాహ పుకార్లను కొట్టిపారేయలేం అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
ఇక ఇప్పుడు నయనతార తల్లి కాబోతున్నట్టు జోరుగా ప్రచారం నడస్తుంది.నయనతార-విఘ్నేశ్ శివన్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. సరోగసీ ద్వారా నయనతార తల్లి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మీడియా వర్గాలు నయనతార సన్నిహితులను ఆరా తీయగా.. అందులో నిజం లేదని తేలిపోయింది. నయనతార-విఘ్నేశ్ శివన్‌లకు ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. కాని బయట మాత్రం సరోగసి ద్వారా ఈ జంట పిల్లలను ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది. కాగా, కొద్దిరోజుల క్రితం నయనతార-విఘ్నేశ్ శివన్ చెన్నైలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
nayanthara become mother
నయనతార ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మలయాళీ హిట్ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మోహన్ రాజా దర్శకడు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార విషయానికి వస్తే.. తెలుగులో ఆమె విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమాలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.