Home » Entertainment » Nayanthara Conditions For Movie With Megastar Chiranjeevi
Entertainment

Nayanthara : చిరంజీవితో సినిమాకు లెక్కలేనన్ని కండిషన్స్ పెట్టిన నయనతార.. వింటే షాక్ అవ్వాల్సిందే?

Authored By
mallesh
The Telugu News | Published on: September 27, 2022, 7:00 pm
Advertisement

Nayanthara : తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనగానే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే చిరుతో సినిమా అంటే మాములుగా ఉండదని అందరికీ తెలుసు. దర్శకనిర్మాతలు కూడా చాలా కేర్ తీసుకుంటారు.సినిమా హిట్ అయితే అవకాశాలు వెంట పడుతుంటాయి. కాల్ షీట్స్ కూడా ఇవ్వలేనంత బిజీగా మారిపోతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే, ఓ నటి మాత్రం చిరుతో సినిమాకు చాల కండిషన్స్ పెట్టిందట..

Advertisement

Nayanthara : ఆమె లాజిక్ కూడా నిజమే కదా..

కోలివుడ్ సీనియర్ హీరోయిన్ నయనతార కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మళయాలం ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ తనకు ఇంకా వయస్సు మీద పడలేదని ప్రూవ్ చేస్తోంది.ఇటీవల దర్శకుడు విగ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. ఇక మెగాస్టార్ చిరు ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత.. మళయాలంలో సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమెక్ గాడ్ ఫాదర్ ద్వారా మరోసారి ఫ్యాన్స్ ముందుకు రానున్నారు.ఇందులో చిరు చెల్లెలి క్యారెక్టర్ కోసం నయనతారను తీసుకున్నారు.

Nayanthara Conditions For Movie With Megastar Chiranjeevi

Advertisement

ఆమె కంటే ముందు చాలా మంది హీరోయిన్లను అనుకున్నా వారికంటే నయన్ బెటర్ అని మూవీ యూనిట్ భావించిందట.. అయితే, చిరు చెల్లెలి పాత్రలో కనిపించబోనని నయన్ తేల్చిచెప్పిందట.. ఆ తర్వతా చిరంజీవి పర్సనల్ రిక్వెస్ట్ మేరకు ఓకే చెప్పిందట.. కానీ లెక్కలేనన్ని షరుతులు పెట్టిందట. అదేమంటే కాల్ షీట్స్ ఎక్కువగా ఇవ్వనని.. అవుట్ డోర్ షూటింగ్స్ అంటే రాలేనని.. రెమ్యూనరేషన్ కూడా తాను ఎంత చెబితే అంత ఇవ్వాలని కండిషన్స్ పెట్టిందట..ఈ విషయం తెలిసి మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. చిరుతో సినిమాకు ఇన్ని కండిషన్స్ పెట్టి మా హీరో లెవల్ తగ్గిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి