Home » Entertainment » Nayanthara Insulted Allu Arjun
Entertainment

Nayanthara : అల్లు అర్జున్ ని అత్యంత దారుణంగా అవమానించిన నయనతార ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 23, 2023, 5:00 pm
Advertisement

Nayanthara : సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది నయనతార. అలాంటి నయన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురి అవుతుంది. అల్లు అర్జున్ ని అత్యంత దారుణంగా అవమానించిందని బన్నీ ఫ్యాన్స్ ఆమెపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. గతంలో ఓ ఈవెంట్ లో నయన్ స్టేజ్ మీదే అల్లు అర్జున్ ని అవమానించింది. ఆ ఈవెంట్ లో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి నయనతారకు అవార్డ్ వచ్చింది. అయితే ఈవెంట్ మ్యానేజ్ మెంట్ ఈ అవార్డ్ ను అందజేయాల్సిందిగా స్టార్ హీరో అల్లు అర్జున్ ని కోరారు.

Advertisement

Nayanthara insulted Allu Arjun

అయితే స్టేజ్ పైన అల్లు అర్జున్ అవార్డ్ ఇస్తుండగా నాకు ఈ అవార్డ్ ని విఘ్నేష్ శివన్ తో తీసుకోవాలని ఉంది అంటూ నయనతార చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటివి పెద్దగా పట్టించుకోని బన్నీ అక్కడ ఉన్న విఘ్నేష్ శివన్ కి అవార్డ్ ఇచ్చి పక్కకు తప్పుకున్నాడు. అయితే ఈ విషయాన్ని బన్నీ ఫాన్స్ కు ఆగ్రహం కలిగిస్తుంది. అంతటి స్టార్ హీరోను దారుణంగా అవమానించిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు నీకు ఇంత పొగరు ఉంది కాబట్టే నీ జీవితం ఇలా తగలడింది అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం నయనతారకు అంతగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ఇక ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటున్నాడు అని దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. నయన్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇక తెలుగులో ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత అమ్మడికి తెలుగులో మరే సినిమాలో అవకాశం రాలేదు. ఇక ఆమె భర్త విఘ్నేష్ శివన్ డైరెక్టర్ గా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి