Nayanthara : దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన నయనతార- విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో వర్క్ జరిగింది. దీంతో ఈ పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఈ వివాహానికి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహానికి రజనీకాంత్, విజయ్ సేతుపతి, విజయ్, మణిరత్నం, శివకార్తికేయన్, అట్లీ కూడా హాజరయ్యారు. అయితే ఈ పెళ్లిలో అందరి దృష్టి నయనతారపైనే ఉంది.
నయనతార నగలు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంటాయి.విఘ్నేష్ నయనతారకు రూ.5 కోట్ల విలువైన డైమండ్ రింగ్‌ను కూడా అందించాడు. నయనతారను వివాహం చేసుకున్న నేపథ్యంలో విఘ్నేష్ శివన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించాడు. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ ప్రత్యేక అతిథిగా నిలిచాడు. తమ పెళ్లి సందర్భంగా నయన్-విఘ్నేష్ జంట రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది నిరుపేదలు, అనాథలకు భోజనాలు ఏర్పాటుచేశారు. కొన్ని దేవాలయ్యాల్లో అన్నదానాలతో పాటు, అనాథాశ్రయాల్లో వేలాది మందికి భోజనాలు పెట్టారు.దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు నయన్-విఘ్నేష్.
గతేడాది వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. చివరకు పెళ్లితో ఒకటైంది ఈ జంట. నయన్ ను పెళ్లాడిన వెంటనే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు విఘ్నేష్. తాళి కట్టిన తర్వాత ప్రేమతో ముద్దాడిన ఫొటోను కూడా విడుదల చేశాడు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది నయనతార. కర్నాటకకు చెందిన నయనతార.. 2003లో తమిళం చిత్రం ‘మనస్సినక్కరె’తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి దాదాపుగా 80కిపైగా చిత్రాల్లో నటించింది. తను నటించిన సినిమాలన్నీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ నే తెచ్చిపెట్టాయి. కొన్నింటికి స్పందన రాకపోయినా.. వసూళ్లలో మాత్రం మంచి ఫలితాలను తెచ్చిపెట్టాయి.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.