Nayanthara lover gives clarity about their marriage
Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నాళ్లుగా ఈ అమ్మడు దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే సుదీర్ఘ ప్రేమకథకు ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వారి డేటింగ్ వ్యవహారం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నది. అయితే ఇటీవల ఈ ఇద్దరి సెలబ్రిటీల పెళ్లి వార్త మీడియాలో ప్రధానంగా చర్చకు దారి తీసింది. ఇటీవల వీరిద్దరు పలు పుణ్యక్షేత్రాలకు సందర్శిస్తుండడంతో వీరి పెళ్లి చర్చకు వచ్చింది. జూన్ 9వ తేదీన నయనతార వివాహం జరుగుతుందనే వార్త మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుపతి పుణ్యక్షేత్రంలో వీరిద్దరి వివాహం జరుగుతుందనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. రాత్రి 10గంటల సమయంలో పెళ్లి జరగనుందని టాక్.పెళ్లి తర్వాత చెన్నైలో భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రిసెప్షన్‌కు సంబంధించిన ఏర్పాట్లలో స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నయనతార, విఘ్నేష్ శివన్ సంయుక్తంగా నిర్మించిన కథు వాకులా రెండు కాదల్ చిత్రం రిలీజై తమిళంలో మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది. సినిమా అందించిన విజయం నేపథ్యంలో వారు తమిళనాడులోని మహబలిపురంకు వెళ్లారు. అక్కడి పురాతన కట్టడాలను సందర్శించారు.
nayanthara marriage news in trending
వారిద్దరి పర్యటనకు సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి.ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నిర్మాతగా సినిమా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు ఓ వార్త ఇటీవల వైరల్ అయ్యిన తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అన్న టాక్ కూడా వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు సంజయ్ మొత్తం ఇదంతా పర్యవేక్షిస్తున్నాడు అన్నారు. ధోనీ తొలి చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోందని… ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ధోని ప్యాన్స్, నయనతార అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.