Home » Entertainment » Nayanthara Marriage Topic Now
Entertainment

Nayanthara : పెళ్లి చేసుకున్న న‌య‌న‌తార‌.. అస‌లు విష‌యం ఇలా బ‌య‌ట‌పడింది..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 14, 2022, 8:30 pm
Advertisement

Nayanthara : కోలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ జంట కొన్నాళ్లుగా త‌మ ప్రేమ విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న క్ర‌మంలో న‌య‌న్ అండ్ విఘ్నేష్ పెద్ద షాకే ఇచ్చారు. సినిమాల కంటే ఎక్కువగా నయనతార తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ప్రేమ వ్యవహారాలు సౌత్ లో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. శింబు, ప్రభుదేవా లాంటి నటులతో నయనతార పెళ్లి పీటల వరకు వెళ్లి బ్రేకప్ చేసుకుంది. మొదటిసారి శింబుతో పెళ్లి కన్ఫర్మ్ అనుకున్నారు. నేడో రేపో మూడు ముళ్లు వేస్తారు అనుకుంటున్న తరుణంలో విడిపోయింది. ఇక ప్రభుదేవాతో కూడా అంతే.

Advertisement

కొంత కాలంగా విఘ్నేష్ శివ‌న్‌తో తెగ సంద‌డి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.‘నానూ రౌడీదాన్‌’ మూవీ షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట చాలాకాలం పాటు రహస్యంగా తమ రిలేషన్ మెయిన్‌టైన్ చేసి ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. దీంతో నయనతార- విగ్నేష్ జోడీ ఎక్కడికి వెళ్లినా అదో పెద్ద న్యూస్ కావడం, అందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ కావడం జరుగుతూ వస్తున్నాయి. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఘనంగా ఇరు కుటుంబాల సమక్షంలో నయనతార పెళ్లి జరగుతుందని అంతా భావించారు. కానీ అందుకు ముహూర్తం కుదరలేదు. ఇటీవ‌ల ఈ ఇద్ద‌రు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న‌ట్టు స‌మాచారం.తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో ఆ అనుమానాలను రెట్టింపు చేసింది.

nayanthara marriage topic now

Advertisement

Nayanthara : పెళ్లి పీట‌లు ఎక్కేసిందిగా..!

ఇటీవల తమిళనాడులోని ఓ అమ్మవారి ఆలయానికి వెళ్లారు నయన్- విగ్నేష్. అయితే ఆ ఆలయంలో నయనతార నుదుటిపై కుంకుమ పెట్టుకొని కనిపించడంతో వీళ్లిద్దరి సీక్రెట్ మ్యారేజ్ టాపిక్ తెరపైకి వచ్చింది. ఆ మధ్య అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ వెళ్లినపుడు కూడా జంట‌గా కనిపించారు నయన్ జంట. అక్క‌డే దేవున్ని ద‌ర్శించి భార్యాభ‌ర్త‌లు ఆ గుళ్లో చేసే ప్ర‌తీ ప‌ని క‌లిసి చేసారు. ఇటీవ‌ల అత్తివరదరాజ స్వామి గుడిని కూడా కలిసే దర్శించుకున్నారు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలి ఈ ఇద్దరూ భార్యాభర్తలు అవునని చెప్పడానికి అని నెటిజ‌న్స్ అంటున్నారు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి