Home » Entertainment » Nayanthara Mid Night Surprise To Vignesh
Entertainment

Nayanthara : అర్ధ‌రాత్రి ప్రియుడ‌కి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన న‌య‌న‌తార‌.. ఆనందానికి అవ‌ధులే లేవుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 14, 2022, 8:30 pm
Advertisement

Nayanthara : కోలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ఈ మ‌ధ్య కాలంలో ఎంత సంద‌డి చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ్లి కాక‌పోయిన కూడా ప‌లు చోట్ల చ‌క్క‌ర్లు కొడుతూ తెగ ర‌చ్చ చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటారంటూ ఎప్పటి కప్పుడు సరికొత్త కథనాలు నెట్టింట కొన్ని నెలలుగా వైరల్ అవుతూనే వున్నాయి. పెళ్లికి టైమ్ రావాలంటూనే సహజీవనం చేస్తున్న ఈ జంట నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రతీ అకేషన్ ని జంటగా సెలబ్రేట్ చేసుకుంటూ నెట్టింట వైరల్ గా నిలుస్తున్నారు. ప్రేమ లేఖలు, పుష్పగుచ్ఛాలు, టెడ్డీబేర్‌లు, చాక్లెట్లు, విలువైన బహుమతులు, హాలీడే ట్రిప్పులు.. ఇలా ప్రేమను కురిపిస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు.

Advertisement

ప్రేమికుల రోజును పురస్కరించుకుని కోలీవుడ్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తన ప్రియుడిని సర్‌ప్రైజ్‌ చేసింది.సోమవారం వాలెంటైన్స్ డే కావడంతో ఈ జంట నెట్టింట అర్థ్ర రాత్రి నుంచే హంగామా మొదలుపెట్టేసింది.లేట్ నైట్ ఫ్లవర్ బొకేతో విఘ్నేష్ శివన్ కు ఎదురుపడిన నయనతార సిగ్గుల మొగ్గవుతూ తన చేతిలో వున్న బోకేని విఘ్నేష్ కి అందించింది. ఆ వెంటనే తనని హగ్ చేసుకుని తన కౌగిలితో బందీని చేసింది. దీనికి సంబంధించిన వీడియోని విఘ్నేష్ ఇన్ స్టా వేదిగా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి అందమైన క్యాప్షన్ ని కూడా జత చేశాడు. తొలిసారి తనకు ఫ్లవర్ బొకేని అందించి ప్రపోజ్ చేసినట్టుగా నయన తనకు ఫ్లవర్ బొకేని అందించిందని ఇదే నిజమైన వాలెంటైన్స్ డే అని విఘ్నేష్ శివన్ కామెంట్ చేశాడు.

nayanthara mid night surprise to vignesh

Advertisement

Nayanthara : ప్రేమ జంట ర‌చ్చ మామ‌లుగా లేదుగా..!

వీడియో త‌న అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుండ‌గా, ఇందులో ఎల్లోకలర్ షార్ట్ గౌన్ లో పైన బ్లాక్ జీన్స్ షర్ట్ ధరించిన నయన కనిపించగా బ్లూ జీన్స్.. బ్లూ షర్ట్ లో కనిపించాడు. నయనతార ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన `కాతువాకుల రెండు కాదల్` చిత్రంలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో సమంత నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ సినిమా టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి