nayanthara ready to romance with movie
Nayanthara : సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ రొమాన్స్‌కి చాలా దూరంగా ఉంటారు. కొందరు మాత్రం పెళ్లైనప్పటికీ గ్లామరస్ రోల్స్‌తో పాటు రొమాన్స్ పండించేందుకు చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు నయనతార కూడా అదే బాటలో నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవలే విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుని అత్తగారింట్లో కాలు పెట్టింది. ఇటీవలే హనీమూన్ కూడా ముగించుకుని మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే విఘ్నేష్ మెడలో మూడు ముళ్లు వేసిన తర్వాత నయన్ పారితోషికం అమాంతం పెంచేనసినట్లు కోలీవుడ్ మీడియా చెబుతుంది. మునుపటి కన్నా పారితోషికం రెట్టింపు చేసిందని ప్రచారం సాగింది.
పెళ్లైనా..ఓ బిడ్డకు తల్లైనా నయనతార హీరోలతో రొమాన్స్ చేయడం ఏమాత్రం తగ్గనంటోంది. వృత్తి పరంగా తాను ఎప్పుడూ దర్శకుల హీరోయిన్ అనే మాటని గట్టిగానే చెబుతుంది. నయనతార పాత సినిమాల్లో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలా సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో రియలిస్టిక్ గానే నటించింది. హీరోతో పెదవి ముద్దులు.. బెడ్ రూమ్ సన్నివేశాలు అన్ని అగ్గిరాజేసేలానే ఉంటాయి. చిట్టిపొట్టి దుస్తుల్లోనూ అమ్మడు తెరపై ఎంతో హైలైట్ అయింది. తాజాగా అందుతోన్న సోర్స్ ప్రకారం పెళ్లైనా నయన్ పెళ్లికి ముందులాగా వెండి తెరపై కనిపించడానికి సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
nayanthara ready to romance with movie
ప్రస్తుతం నయన్ చేతిలో నాలుగైదు సినిమా లున్నాయి. అందులో ఒకటి బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ `జవాన్` ఉంది. బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో అది. మరి ఇందులో షారుక్ తో రొమాన్స్ కి స్కోప్ ఉంటుందా? అన్నది చూడాలి. సాధారణంగా హిందీ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సహజంగా ఉంటాయి. మరి `జవాన్` లో వాటికి స్కోప్ ఉందా? ఉంటే ఆ సీన్స్‌లో నయనతార నటిస్తుందా అన్నది చూడాలి. నయనతార ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలతోను చాలా బిజీగా ఉంది.
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
This website uses cookies.