
The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’ రిలీజ్ తర్వాత మళ్లీ మారుతిపై ట్రోలింగ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!
The Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫలితంగా ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంత పెద్ద స్టార్ హీరో అవకాశం ఇచ్చినా, కథా–కథనం, దర్శకత్వం విషయంలో సరైన న్యాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు.
The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’ రిలీజ్ తర్వాత మళ్లీ మారుతిపై ట్రోలింగ్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!
సినిమా విడుదల సమయంలోనే మారుతిపై ట్రోలింగ్ పెద్ద ఎత్తున సాగింది. కథ బలహీనంగా ఉందని, ప్రభాస్ ఇమేజ్‌కు సరిపడని స్క్రిప్ట్ ఎంచుకున్నారని అభిమానులు మండిపడ్డారు. కొందరు మరీ హద్దులు దాటి దర్శకుడి ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ద్వారా ఫుడ్ పార్సిల్స్, మెడికల్ పార్సిల్స్ పంపించడం వరకు వెళ్లారు. ఈ విషయాన్ని మారుతీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. తరువాత ఆ వివాదం కొంతకాలం నిశ్శబ్దంగా మారినట్టు కనిపించింది.అయితే తాజాగా ‘ది రాజాసాబ్’ ఓటీటీ రిలీజ్ కావడంతో మళ్లీ ట్రోలింగ్ ఊపందుకుంది. సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత నెటిజన్లు చిత్రంలోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని సన్నివేశాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దర్శకుడు మారుతీని ట్యాగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక మరికొందరు అభిమానులు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ స్థానంలో డూప్ ఉపయోగించారని ఆరోపిస్తూ వీడియో క్లిప్స్, ఫోటోలు షేర్ చేస్తున్నారు. “ప్రభాస్‌తో కాకుండా మరెవరితోనో సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ప్రభాస్ మాత్రం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్న ప్రభాస్, కల్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే భారీ ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ది రాజాసాబ్ నిరాశను మరిచిపోయేలా వచ్చే చిత్రాలతో ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Hantavirus : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.…
LPG Cylinder Rule : దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో…
CM Vijay Trisha : తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ…
Eluru : నమ్మకమే పెట్టుబడిగా, భక్తిని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను వంచించే వారు సమాజంలో పెరిగిపోతున్నారు. పశ్చిమ గోదావరి…
Neem Water Bath Benefits : వేపలో వేల ఏళ్లుగా గుర్తించబడిన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ…
Sweating : చెమట పట్టడం అనేది శరీరంలో జరిగే ఒక అత్యంత సంక్లిష్టమైన జీవక్రియ. దీనిని శాస్త్రీయ పరిభాషలో 'థర్మోరెగ్యులేషన్'…
Coffee : చాలామంది ఉదయం కళ్లు తెరవగానే బెడ్ కాఫీ కోసం వెతుకుతుంటారు. అల్పాహారం కంటే ముందే ఖాళీ కడుపుతో…
Mother : లోకంలో ఏ బంధమైనా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తుందేమో కానీ, అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ నిస్వార్థంగానే…
Teacher : చదువు పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంచడం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా, వ్యక్తిగతంగా కొంతమంది…
CM Vijay : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది.…
BJP Telangana : భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఎన్నికల మూడ్‌లోనే ఉంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ పార్టీ…
Cucumber Face Packs : కీరదోస కేవలం ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఒక వరప్రసాదం. ఇందులో విటమిన్…
This website uses cookies.