Home » Entertainment » Netizen Serious Warning To Rajamouli
Entertainment

Rajamouli : “ఏరా రాజమౌళి గా” అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు .. !!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 11, 2023 9:06 pm
Advertisement

Rajamouli : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఒకే తెరపై ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో తెలుగు జాతి ఖ్యాతిని పెంచాడు జక్కన్న. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాదు భారతదేశం అంతా ఎంత గానో ఆసక్తిగా ఎదురు చూశారు. అదే స్థాయిలో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఇద్దరు స్టార్ హీరోలు నటించడంతో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత

Advertisement

తగ్గుతుందేమో అన్న ప్రశ్నలు నెలకొన్నాయి. కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత కనిపించింది. సినిమాలు ఇద్దరికీ సమానమైన పాత్రలు ఇవ్వడం, స్టార్ హీరోలను ఒకే తెరపై చూడటం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అలాగే వీళ్లిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ ఆ పాత్రలలో చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా విడుదల కావడానికి చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది.

netizen serious warning to Rajamouli

Advertisement

హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా హిందీ వెర్షన్ మీద ఒక నెటిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ నేటిజన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ నెటిజన్స్ ఏరా జక్కన్నా హిందీ వెర్షన్ లో కూడా కొన్ని సీన్స్ లో అన్నా అని పెట్టడం అంత అవసరమా అని రాశారు. అలాగే మా ఫ్లోర్లో ఉంటే ఒక నేపాల్ పాపకి ఆర్ఆర్ఆర్ సినిమాలో అన్న అనే పదం బాగా నచ్చేసిందట.ఆ పదం చాలా బాగుంది నేను కూడా నిన్ను అన్నా అని పిలుస్తా అని అంటుంది అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి