Bigg Boss 6 Telugu rating for housemates negligance
Bigg Boss 6 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం బిగ్ బాస్ ఎంత రసవత్తరంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. 21 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో గలాటా గీతూ ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. యూట్యూబర్‌గా, ఐటీ ఉద్యోగిగా, రివ్యూవర్‌గా, ఆర్జేగా, ఆర్టిస్టుగా రాణిస్తుంది గీతూ రాయల్ . సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గీతూ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో గీతూ రాయల్ ఎక్కువ కాలం కొనసాగదని రాబోయే రోజుల్లో ఆమె ఎలిమినేట్ కావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
కొద్ది రోజులుగా గీతూ బిగ్ బాస్ హౌజ్‌లో చేసే సందడి మాములుగా లేదు. ఆమె ఏదో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అయితే గీతూ ఓవరాక్షన్ చూడలేక ఆమెను కంటెస్టెంట్స్ జైలుకి పంపారు. అయిన ఆమె ప్రవర్తన మారలేదు. దీంతో ప్రేక్షకులు బయటకి పంపేస్తామంటున్నారు. ఈ వారం అయితే నామినేషన్స్ లో లేదు కాబట్టి సేవ్ అయినట్టే. వచ్చే వారం నామినేషన్స్ కి వస్తే మాత్రం గీతూ కథ ముగిసినట్టే అని అంటున్నారు. ఆమె అతి కొంతసేపు చేస్తే బాగుంటుందని ఎక్కువ సమయం చేస్తే మాత్రం నష్టం తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో చాలామంది కంటెస్టెంట్లు సైలెంట్ అయిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Netizens Trolls On Bigg Boss 6 Telugu Lady Contestant
బిగ్ బాస్ సీజన్6 ఏ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షోను నిర్వహిస్తుండగా ఈ షో వాళ్లకు ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ సీజన్6 లో యూట్యూబర్లు, టిక్ టాక్ స్టార్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత దక్కడం గమనార్హం. హౌజ్‌లో ఆది రెడ్డి, గలాట గీతూ, సింగర్ రేవంత్‌ల మీద విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. పనీ పాట లేకుండా మిగతా వారి మీద రివ్యూలు ఇస్తూ ఆదిరెడ్డి, అందరి మీద గంప నోరేసుకుని గీతూ పడిపోవడం, తన మాటే నెగ్గాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించే రేవంత్.. ఇలా అందరి మీద ఓ ముద్ర పడింది. ఇక ఇంటిని చక్కబెట్టేందుకు నాగార్జున ప్రయత్నించాడు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.