Home » Entertainment » Niharika Konidela Goes For Vacation With Her Husband
Entertainment

niharika konidela: వెకేషన్‌కు చెక్కేసిన మెగా జంట.. భర్తతో నిహారిక రచ్చ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 25, 2021, 8:15 am
Advertisement

niharika konidela  : మెగా డాటర్ నిహారిక కొణిదెల పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. టీవీలో యాంకర్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన నిహారిక.. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లతో సందడి చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా మారింది. అయితే చైతన్యను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. అయితే సినిమాలపై ఇష్టంతో ప్రొడ్యూసర్‌గా కూడా మారింది. ఆమె నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఇటీవలే జీ5 ఓటీటీలో విడుదలైంది. నిహారిక ప్రస్తుతం తన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

Advertisement

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తన గురించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా నిహారిక తన భర్త చైతన్యతో కలిసి వెకేషన్‌కు చెక్కేసింది. ఇందుకు సంబంధించి నిహారిక, చైతన్యలు ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్‌లు చేశారు. అయితే నిహారిక మాత్రం తాము ఎక్కడికి వెళ్తున్నామనేది వెళ్లడించలేదు. పైగా తాము స్విట్జర్లాండ్‌ వెళ్తున్నామో, స్పెయిన్ వెళ్తున్నామో చెప్పాలని నిహారిక అభిమానులనే అడిగింది.

niharika konidela goes for vacation with her husband

Advertisement

niharika konidela : చైతన్య, నిహారికల రచ్చ..

అయితే గతేడాది డిసెంబర్‌ 9వ తేదీన నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నిహారిక-చైతన్యలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత నిహారిక తన భర్తతో కలిసి హనీమూన్‌ కోసం మాల్దీవులకు వెళ్లింది. ఆ తర్వాత టూర్స్‌కు వెళ్లారు. అయితే మరో కొద్ది రోజుల్లో నిహారిక- చైతన్యలు మొదటి వివాహా వార్షికోత్సం జరుపుకోనున్నారు. ఈ క్రమంలోనే ఈ క్యూట్ కపుల్ ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు వెకేషన్‌ను చెక్కేసినట్టుగా తెలుస్తోంది. మరి నిహారిక ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుందో చూడాలంటే.. ఆమె షేర్ చేసే పోస్టుల కోసం వేచి చూడాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి