Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్‌లు ఊహాజనితం. అప్పటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉండేవారి మధ్య కూడా బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్స్ వారు విడిపోయేలా చేస్తుంటాయి. అలాంటివి మనం ఎన్నో చూశాం. తాజా సీజన్‌లో బిగ్ బాస్ నిఖిల్, గౌతమ్ మధ్య పెద్ద గొడవే పెట్టాడు. తొమ్మిదో వారం రాయల్ క్లాన్, ఓజీ క్లాన్‌లను కలిపి బిగ్ బాస్ మెగా క్లాన్ గా మార్చేశాడు. ఈ క్లాన్ కోసం మెగా చీఫ్ అయ్యేందుకు టాస్క్ లతో రచ్చ చేశాడు బిగ్ బాస్. ఈ మేరకు హౌజ్‌మేట్స్ ని నాలుగు టీమ్‌లుగా విడగొట్టాడు. యష్మి, గౌతమ్, ప్రేరణలు రెడ్ టీమ్‌గా, హరితేజ, నిఖిల్, అవినాష్ బ్లూ టీమ్‌గా, రోహిణి, పృథ్వీరాజ్, నయని పావని ఎల్లో టీమ్‌గా, తేజ, విష్ణుప్రియా నబీల్ గ్రీన్ టీమ్‌గా విభజించారు.
రెడ్ టీమ్‌కి యష్మి, బ్లూ టీమ్‌కి హరితేజ, పృథ్వీ ఎల్లో టీమ్‌కి, నబీల్ గ్రీన్ టీమ్‌కి లీడర్లుగా ఉన్నారు. వీరంతా మెగా చీఫ్ కోసం బిగ్ బాస్ ఇంటికి దారేదీ పేరుతో టాస్క్ లు పెట్టారు. అందులో భాగంగా మంచి మనిషి అనే టాస్క్ ఇచ్చాడు.స్నోతో నాలుగు బొమ్మలున్నాయి. అందులో నాలుగు టీమ్‌లు ఆ స్నోకి పార్ట్ లు పెట్టి, మంచి మనిషిగా తయారు చేయాల్సి ఉంటుంది. అయితే టీమ్‌లోని ముగ్గురు ఒక ప్యాడ్‌పై నిల్చొని ఒకేసారి నడుస్తూ దాన్ని చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్లూ టీమ్ విజయం సాధించింది. రెడ్ టీమ్‌కి ఎల్లో కార్దు ఇచ్చారు. పానిపట్టు యుద్ధం పేరుతో రెండో ఛాలెంజ్ ఇచ్చారు బిగ్‍బాస్. నాలుగు టీమ్‍లు వారి ట్యాంకుల్లో నీరు తక్కువగా ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ ఛాలెంజ్‍లో నిఖిల్ దురుసుగా ప్రవర్తించారు. బజర్ అయ్యాక కూడా ప్లగ్‍లను నిఖిల్ విసిరివేయడంతో ఇతర కంటెస్టెంట్లు అభ్యంతరం తెలిపారు. యష్మి, ప్రేరణపై బ్లూటీమ్ నిఖిల్ దురుసుగా ప్రవర్తించారు.
ఇద్దరి చేతులు పట్టుకొని లాగారు. ఇష్టం వచ్చినట్టు తోసేశారు. ట్యాంకును కాలితో తన్నారు. దీంతో గౌతమ్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలతో అలాగేనా చేసేది అంటూ నిఖిల్‍పై ఫైర్ అయ్యారు. నిఖిల్‍పై యష్మి కూడా కోప్పడ్డారు. సంచాలక్ ఆపాలన్నా అలాగే తోడయం కరెక్ట్ కాదంటూ అరిచారు. రూల్ ఫాలో చేయడం లేదని అన్నారు. ఆపిన పద్ధతి బాగోలేదంటూ నిఖిల్‍తో గొడవ పడ్డారు గౌతమ్. ఓవర్ యాక్టింగ్ చేయవద్దని కామెంట్ చేశారు నిఖిల్. దీంతో “నువ్వు చేసిందే ఓవర్ యాక్టింగ్” అని గౌతమ్ అరిచారు. కొడతావా అంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. “నువ్వు ప్రవర్తించిన తీరు రాంగ్” అంటూ గౌతమ్ అరిచారు. తిట్టించుకొని ఊరికే కూర్చోవాలా అంటూ నిఖిల్ గేమ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్…
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా…
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు…
Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన…
Legs : మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా మరియు ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఎటాక్ చేసినా ముందుగా వాటి…
Choti Diwali : ఈ ఏడాది అక్టోబర్ నెలంతా పండుగలతో క్యాలెండర్ నిండిపోయింది. దసరా పండుగ ముగిసిందో లేదో మూడు…
ICAI CA Result 2024 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) …
Honey For Skin : తేనే అనేది మన ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చెప్పొచ్చు. అయితే ఈ తేనె…
This website uses cookies.