Nirupam As Shiva And Premi Viswanath As Parvathi In Star Maa Vinayaka Chavithi Event
Karthika Deepam : బుల్లితెరపై డాక్టర్ బాబు, వంటలక్క క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎప్పటికీ తగ్గదు. వారు లేకపోతే కార్తీక దీపం సీరియల్ ఎవ్వరూ పట్టించుకోరు అనేది అందరికీ అర్థమైంది. ఒకప్పుడు టీఆర్పీలకు రారాజులా ఉండే షో కాస్తా.. అభాసుపాలైంది. ఒకప్పుడు రెండి డిజిట్ల రేటింగ్ సాధించే కార్తీక దీపం.. వంటలక్క,డాక్టర్ బాబు మాయం అవ్వడంతో ఒకట్లో స్థానంలో రేటింగ్ పడిపోయింది. ప్రేమీ విశ్వనాథ్ వంటలక్క, దీపగా చేసిన మాయ.. డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాల యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యా రు. అందుకే కార్తీకదీపం సీరియల్ ఆ రేంజ్‌లో హిట్ అయింది. ఇక మధ్య కొన్ని రోజులు ఆ పాత్రలను చంపేశారు. అంతా మార్చేశారు. జనరేషన్‌ను మార్చేశారు. కొత్తవాళ్లను పెట్టుకున్నారు. అయితే రేటింగ్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి.
దీంతో చేసేదేం లేక మళ్లీ నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్‌లను తీసుకొచ్చారు. దీంతో రేటింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇప్పుడు వంటలక్క, డాక్టర్ బాబుల ఆగమనంతో సీరియల్ టాప్ రేటింగ్‌లోకి దూసుకెళ్తోంది. దీంతో వీరిద్దరితో మరిన్ని షోలు ఈవెంట్లు చేయాలని ఫిక్స్ అయింది స్టార్ మా. అందుకే ఈ సారి వినాయక చవితి ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసేందుకు రెడీ అయ్యారు. మాతో పండుగే పండుగ అంటూ చేయబోతోన్న ఈ ఈవెంట్‌లో డాక్టర్ బాబు శివుడిలా.. పార్వతీ దేవిలా వంటలక్క నటించింది. గణనాథుడి చరిత్రను బుల్లితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు.
Nirupam As Shiva And Premi Viswanath As Parvathi In Star Maa Vinayaka Chavithi Event
ఇక ఈ ఈవెంట్‌లో ఇధే హైలెట్ కానున్నట్టు కనిపిస్తోంది. శివుడి గెటప్‌లో నిరుపమ్ అద్భుతంగా అనిపిస్తే.. పార్వతీ మాతగా ప్రేమీ విశ్వనాథ్.. అందరూ దండం పెట్టి మొక్కేలా మెస్మరైజ్ చేసేసింది. మరి ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది.. ఇంకా ఏ ఏ కార్యక్రమాలున్నాయి.. ఎవరెవరు పాల్గొనబోతోన్నారనే విషయాలను మున్ముందు రివీల్ చేస్తారేమో. మరో వైపు ఈటీవీ కూడా వినాయకచవితి స్పెషల్ ఈవెంట్‌ను రంగంలో దించేందుకు రెడీ అయిందని సమాచారాం. కానీ డాక్టర్ బాబు, వంటలక్కలను ఢీ కొట్టగలవారెవ్వరున్నారనేది అనుమానం.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.