Home » Entertainment » Nirupam Paritala And Manjula Bangaram Trolls Reel Video
Entertainment

Karthika Deepam Nirupam : చీ పోరా అంటూ డాక్టర్ బాబు భార్య రచ్చ.. మంజులను మెడ పట్టుకుని గెంటేసిన నిరుపమ్

Authored By
aruna
The Telugu News | Published on: September 27, 2022, 8:30 pm
Advertisement

Karthika Deepam Nirupam : సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా బంగారం అక్క ఎంతగా ట్రెండ్ అవుతోందో అందరికీ తెలిసిందే. బంగారం ఒకటి చెప్పనా అంటూ ట్రోల్స్, మీమ్స్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. శాంతి అంటూ రాయలసీమ అమ్మాయి చేసిన ఈ వీడియో నెట్టింట్లో దుమ్ములేపేసింది. ఆమెను సోషల్ మీడియా స్టార్‌ను చేసేసింది. ఇంఫ్లూయెన్సర్ అవార్డును కూడా తెచ్చి పెట్టేసింది. అలా బంగారం అక్కగా శాంతి ఫుల్ ఫేమస్ అయింది. టీవీ చానెళ్లు, యూట్యూబ్, జబర్దస్త్ వంటి షోల్లోనూ బంగారం అక్క సందడి చేస్తోంది. ఇక బంగారం మీద వచ్చిన డీజే సాంగ్, ట్రోల్ వీడియోలకు రీల్స్ ఏ రేంజ్‌లో చేస్తోన్నారో అందరికీ తెలిసిందే.

Advertisement

సెలెబ్రిటీలంతా కూడా బంగారం మీద పడ్డారు. బంగారం వీడియోకు రీల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మంజుల, నిరుపమ్ వంతు వచ్చింది. బుల్లితెరపై డాక్టర్ బాబుగా ఫేమస్ అయిన నిరుపమ్.. నెట్టింట్లో తన ప్రాసలు, పంచులతో తెగ హల్చల్ చేస్తుంటాడు. నిరుపమ్ ఫన్నీగా వేసే ఇన్ స్టా పోస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. పంచ్ డైలాగ్స్‌తో అందరినీ కట్టి పడేస్తుంటాడు. ఇక నిరుపమ్‌కు తగ్గట్టుగా మంజుల కూడా సోషల్ మీడియాను వాడేస్తుంటుంది. యూట్యూబ్‌లో మంజుల నిరుపమ్ అనే చానెల్‌తో డాక్టర్ బాబు భార్య సందడి చేస్తుంటుంది. డాక్టర్ బాబుకు సంబంధించిన పర్సనల్ విషయాలు, ఇంట్లో జరిగే ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

Karthika Deepam Nirupam Paritala And Manjula Bangaram Trolls Reel Video

Advertisement

అందుకే ఆమె షేర్ చేసే వీడియోలకు మంచి వ్యూస్ వస్తుంటాయి. ఇక నిరుపమ్ ఆ యూట్యూబ్ వీడియోల్లో ఉండే తీరు, మాట్లాడే మాటలు, వేసే పంచులు వైరల్ అవుతుంటాయి. ఇక మంజుల చేసే రీల్ వీడియోలు కూడా అందరినీ నవ్విస్తుంటాయి. అయితే ఈ రీల్ వీడియోలకు డాక్టర్ బాబు దూరంగానే ఉంటాడు. కానీ ఇప్పుడు మంజుల, నిరుపమ్ కలిసి బంగారం ట్రోల్ వీడియోకు రీల్స్ చేశారు. ఇందులో చివర్లో.. చీ పోరా అని మంజుల అనేసింది. దీంతో చిరాకు వచ్చిన నిరుపమ్.. పీక పట్టుకుని అలా తోసేసినట్టుగా చేసేశాడు. మొత్తానికి ఈ రీల్ వీడియోను చూసిన జనాలు మాత్రం తెగ నవ్వేసుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి