Home » Entertainment » Nirupam Paritala Fun With Majula In Vinayaka Chavithi Video
Entertainment

Karthika Deepam Nirupam : మగాడి కష్టానికి గుర్తింపు లేదు!.. భార్యతో డాక్టర్ బాబు గొడవ

Authored By
aruna
The Telugu News | Updated on: September 2, 2022 10:54 pm
Advertisement

Karthika Deepam Nirupam : బుల్లితెరపై నిరుపమ్ పరిటాలకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా నిరుపమ్‌కు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. బుల్లితెరపై శోభన్ బాబు అంటూ నిరుపమ్‌ను అభిమానులు పిలుస్తుంటారు. కార్తీక్, డాక్టర్ బాబుగా నెట్టింట్లో నిరుపమ్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు మళ్లీ కార్తీక దీపం సీరియల్లోకి నిరుపమ్ ఎంట్రీ ఇచ్చాడు. కార్తీక దీపం సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు లేకపోవడంతో.. సీరియల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. రేటింగ్‌లలో ఒకప్పుడు తోపులా ఉండే కార్తీకదీపం ఒక్కసారిగా ఢమాల్ అని పడిపోయింది.

Advertisement

దీంతో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలతోనే మళ్లీ సీరియల్ కొనసాగిస్తున్నారు. ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఎంట్రీతో సీరియల్ రేటింగ్ అదిరిపోయింది. అలా బుల్లితెరపై నిరుపమ్ తెచ్చుకున్న క్రేజ్ ఇప్పుడు నెట్టింట్లో మరింతగా పెరిగింది. సోషల్ మీడియాలో నిరుపమ్, అతని భార్య మంజుల దుమ్ములేపుతుంటారు. ఇన్ స్టాగ్రాంలో నిరుపమ్ పెట్టే పోస్టులు, వేసే ప్రాసలు మామూలుగా ఉండవు. పంచ్‌లతో నిరుపమ్ పరిటాల అదరగొట్టేస్తుంటాడు. మంజుల చేసే యూట్యూబ్ వీడియోల్లోనూ నిరుపమ్ కౌంటర్లు వేస్తుంటాడు.

Nirupam Paritala Fun WIth Majula in Vinayaka Chavithi video

Advertisement

తాజాగా వినాయక చవితి స్పెషల్ అంటూ మంజుల ఓ వీడియోను వదిలింది. అందులో తాను ఎలా రెడీ అయ్యానో చూపించుకుంది. ఇదే విషయాన్ని నిరుపమ్ వద్దకు వెళ్లి చెప్పింది. అప్పటికే నిరుపమ్ పూజ గది వద్ద ఏదో సర్దుతుంటాడు. చూశావా? ఎన్ని పనులు చేస్తున్నాను అని నిరుపమ్ అంటాడు. ఏంటి ఇవన్నీ నువ్ చేశావా? అని కౌంటర్ వేస్తుంది మంజుల. మగాడి కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు.. మేం ఎంత చేసినా ఇంతే.. నువ్వైతే రెడీ అయి.. నన్ను చూడండి అంటూ ఇలా చూపించుకుంటున్నావ్ అంటూ మంజుల మీద నిరుపమ్ కౌంటర్లు వేస్తాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి