Venu Swamy : జాతకాలు తప్పైతున్నా వేణు స్వామి వెనక పడుతున్న హీరోయిన్స్..!
Venu Swamy : గత కొద్ది రోజులుగా వేణు స్వామి పేరు నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. ఆయన నాగ చైతన్య, సమంత విడిపోతారని చెప్పి వార్తలలో నిలిచారు. సెలబ్రిటీల జాతకాలను బట్టి.. వారి వారి విజయాలను అపజయాలను అంచనా వేసే వేణు స్వామి.. ఈ మధ్య మాత్రం అంతగా అంచనా వేయడం లేదు. ఏపీలో మరో సారి జగన్ గెలవడం ఖాయం అంటూ ఇటీవల జోస్యం చెప్పారు. అయితే తన అంచనా తప్పడంతో..బేషరతుగా క్షమాపణ చెబుతూ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే సెంట్రల్లో మోదీ ఆదిపత్యం తగ్గుతుందంటూ.. తాను చెప్పిన విషయం నిజమైందని.. కానీ ఏపీ ఫలితాల్లోనే తన అంచనా 100 శాతం తప్పిందంటూ చెప్పారు. అయినా తనను నమ్మి ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారికి దన్యవాదాలు తెలియజేశారు.
వేణు స్వామి జాతకాలు తప్పుతున్నా కూడా హీరోయిన్స్ మాత్రం ఆయనతో జాతకాలు చెప్పించుకునేందుకు క్యూ కడుతున్నారు. ఆయన చెప్పింది జరగకపోయినా దానిని కవర్ చేసుకునే నైపుణ్యం కూడా వేణు స్వామి దగ్గర ఉంది. అందుకే వాళ్లు ఆయన వెనకపడుతున్నారని అంటున్నారు. . డింపుల్ హయాతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వేణు స్వామి జాతకాలు అంతగా వర్కవుట్ కాకపోయిన ఇతర ఇండస్ట్రీల నుండి కూడా ఆయనతో పూజలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా కన్నడ హీరోయిన్ నిశ్విక వెనుస్వామి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నారు.
Venu Swamy : జాతకాలు తప్పైతున్నా వేణు స్వామి వెనక పడుతున్న హీరోయిన్స్..!
నిశ్విక 2018లో హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 28 ఏళ్ళ నిశ్విక కన్నడలో వరుస చిత్రాలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. రష్మిక, నిధి అగర్వాల్ లాంటి క్రేజీ హీరోయిన్లు వేణు స్వామిని నమ్మడంతో నిశ్విక లాంటి వారు కూడా ఆయన కోసం వస్తున్నారు. జాతకాలు తేడా కొడుతున్నా కూడా వేణు స్వామి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.