Home » Entertainment » Nivethathomas New Video Going Viral
Entertainment

Nivethathomas: గో షాలలో నివేత థామస్.. పాలు పితికిన వీడియో వైరల్

Authored By
vamana sai
The Telugu News | Updated on: September 8, 2021 1:46 pm
Advertisement

Nivethathomas: యంగ్ బ్యూటీ నివేత థామస్ కాస్త ఖాళీ సమయం దొరికినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఎప్పుడో ఏదో ఒక సరదా పని చేస్తూ దానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా అలాగే నివేత థామస్ ఓ గో షాలను సందర్షించారు. అక్కడ కాసేపు గోవులతో గడిపిన ఆమే గోవు పాలను పితికారు. ఈ వీడియోను నివేత థామస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ వైరల్ గా మారింది.

Advertisement

nivethathomas new video going viral

ఇక రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో వేముల పల్లవిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న శాకిని ఢాకిని అనే సినిమాలో నటిస్తోంది. రెజీనా మరొక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కొరియన్ సినిమా ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకున్నట్టు సమాచారం. కాగా నివేత థామస్ – రెజీనా ఇందులో భారీ ఫైట్స్ చేస్తారట. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు.

Advertisement

Nivethathomas: ఎక్స్‌ఫోజింగ్ అండ్ గ్లామర్ రోల్స్ చేయకుండానే క్రేజ్ తెచ్చుకొని సత్తా చాటుతోంది.

 

nivethathomas new video going viral

Advertisement

టాలీవుడ్‌లో జెంటిల్ మేన్, నిన్ను కోరి, బ్రోచే వారెవరురా, 118, జై లవ కుశ, వి లాంటి సినిమాలలో నటించిన నివేత థామస్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి సీనియర్ హీరోలకి కూతురుగా నటిస్తూనే మరొకవైపు హీరోయిన్‌గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. యంగ్ హీరోలకి మంచి ఛాయిస్ అయిన ఈ బ్యూటీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటోంది. ఎక్స్‌ఫోజింగ్ అండ్ గ్లామర్ రోల్స్ చేయకుండానే క్రేజ్ తెచ్చుకొని సత్తా చాటుతోంది.

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి