Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో రచ్చ మాములుగా లేదు.. నామినేషన్ హీటెక్కిపోయిందిగా..!
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ బాస్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో సక్సెస్ ఫుల్‌గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ముందుగా హౌజ్‌లోకి 14 కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా, ఏడుగురు కంటెస్టెంట్స్ బయటకి వచ్చారు. ఇక కొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లోకి వెళ్లారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ కౌ గౌర్ల్ పద్ధతిలో జరిగాయి. ఇద్దరు కౌ గర్ల్స్ వేషంలో కిల్లర్ గర్ల్స్‌గా ప్రేరణ, హరితేజ ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. బజర్ మోగగానే పక్కన టేబుల్‌పై ఉన్న హ్యాట్ ఎవరు ముందు తీసుకుంటారో వారికి ఇతర కంటెస్టెంట్స్ నామినేట్ చేసిన సభ్యుల నుంచి ప్రతి ఇద్దరిలో ఒక్కరిని నామినేషన్‌లో ఉంచే పవర్ ఈ కిల్లర్ గర్ల్స్‌కు ఉంటుంది.
అంటే, ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి వారు నామినేట్ చేయాలనుకున్న వారి పేర్లు చెప్పి పాయింట్స్ చెబుతారు. ఆ పాయింట్స్ ఎవరికి అయితే వాలిడ్ అనిపిస్తాయో వారిలో ఒకరిని నామినేట్ చేస్తారు కిల్లర్ గర్ల్స్. అలాగే, వీరిలో ఎవరు తక్కువ సార్లు హ్యాట్ తీసుకుంటారో వారు నామినేషన్‌లో ఉండే రిస్క్ కూడా పెట్టాడు బిగ్ బాస్. దాంతో వీరు సేఫ్ గేమ్ ఆడకుండా ఉండేందుకు చెక్ పెట్టాడు. ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో, వారిలో ఇద్దరు పోటీపడి సాధించాల్సి ఉంటుంద. ఈ క్రమంలో రోహిణి.. గౌతమ్‌ని నామినేట్ చేసింది. అలాగే నిఖిల్.. టేస్టీ తేజని, యష్మి.. తేజని, మణికంఠ నిఖిల్‌ని, అవినాష్ మణికంఠని, గౌతమ్.. విష్ణు ప్రియాని నామినేట్ చేశారు. ఈ ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉంది. ఈ వారం మొత్తంగా తొమ్మిది మంది నామినేట్ అయినట్టుసమాచారం. సోమవారం ఎపిసోడ్‌లో ఐదుగురు నామినేట్ అయినట్టుగానే చూపించారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో రచ్చ మాములుగా లేదు.. నామినేషన్ హీటెక్కిపోయిందిగా..!
బీబీ టాస్క్‌లో సరిగ్గా ఆడలేదని, ఎప్పుడు ఒంటరిగా సైలెంట్‌గా ఉన్నావని, లేకుంటే పోయి దమ్ముకొడతావని, ఇంట్లో పనులు కూడా చేయవని పృథ్వీని నామినేట్ చేసింది గంగవ్వ. తాను బాగానే పని చేశానని, మీరు చూడలేదని పృథ్వీ డిఫెండ్ చేసుకున్నాడు. నువ్ నాకు నచ్చలేదు నేను నామినేట్ చేస్తున్న అని గంగవ్వ తేల్చి చెప్పింది ..తేజ ఆరోగ్యం బాలేకున్న ట్రై చేశాడు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఆ డ్రెస్ వేసుకుని, చిప్ప పట్టుకుని కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ, నీ నుంచి మాత్రం ఎలాంటి ట్రై కూడా లేదని ప్రేరణ చెప్పింది. ప్రేరణపై పృథ్వీ చేసేదానికి యష్మీ కూడా చాలా ఫీల్ అయింది. రెండుసార్లు ప్రేరణకు హ్యాట్ దొరక్కుండా చేసేసరికి యష్మీ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ ఓవైపు, అదే సీరియల్ విలన్ యష్మీ మరోవైపు ఇద్దరు ఫ్రెండ్స్ ఏడ్చేశారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.