Home » Entertainment » Nookaraju And Asia Love Breakup Full Clarity
Entertainment

Jabardasth : జబర్దస్త్‌.. ఆ రియల్‌ లవర్స్ బ్రేకప్‌ పై ఫుల్ క్లారిటీ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 21, 2022, 2:30 pm
Advertisement

Jabardasth : తెలుగు బుల్లి తెరపై సెన్షేషన్ క్రియేట్‌ చేసిన జబర్దస్త్‌ కమెడియన్స్‌ లో చాలా మంది ప్రేమలో ఉన్నారు అంటూ వారి ప్రేమ కథలను చూపించడం ద్వారా రేటింగ్ ను దక్కించుకుంటుంది ఈటీవీ. సుడిగాలి సుధీర్ మరియు రష్మీలతో మొదలు అయిన ఈ వ్యవహారం ఎంతో మందిని చూపించి రేటింగ్ ను అమాంతం పెంచేసుకున్న విషయం తెల్సిందే. ఇమాన్యూల్‌, వర్ష వంటి ప్రేమ జంటలను కేవలం రేటింగ్ కోసం చూపించిన ఈటీవీ కొద్ది మంది ప్రేమలో నిజం ఉందని చెప్పకనే చెబుతోంది. నిజమైన ప్రేమ కథల్లో ఒకటి నూకరాజు మరియు ఆసియా.

Advertisement

వీరిద్దరు కూడా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ షో ద్వారా పాపులారిటీని దక్కించుకున్నారు. వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మద్య మంచి సన్నిహిత్యం ఏర్పడటం ఆ తర్వాత జబర్దస్త్ తో పాటు ఇతర కార్యక్రమాల్లో ఇద్దరిని చూపించడం జరిగింది. ఒక ఎపిసోడ్‌ లో ఇద్దరి ప్రేమ విషయాన్ని రివీల్‌ చేశారు. అప్పుడు కొందరు అది నిజం కాదని.. సుధీర్, రష్మీ మరియు ఇమాన్యూల్ వర్షల మాదిరిగా రేటింగ్ కోసం చేస్తున్న స్టంట్ అంటూ సోషల్‌ మీడియాలో చర్చించడం జరిగింది. అసలు విషయం ఏంటీ అంటే ఇద్దరు ప్రేమించుకున్నారు.

Jabardasth nookaraju and asia love breakup full clarity

Advertisement

కాని కొన్నాళ్లుగా ఇద్దరు స్టేజీ పై లేదా సోషల్‌ మీడియాలో కలిసి కనిపించక పోవడంతో ఇద్దరు ఎప్పుడు చూసినా వేరు వేరుగా ఉంటూ ఉండటంతో ఆసియా మరియు నూకరాజుల ప్రేమ మూడు నాళ్ల ముచ్చటగా మారిందా అంటూ చర్చ మొదలు అయ్యింది. ఎట్టకేలకు వారిద్దరి ప్రేమకు సంబంధించిన క్లారిటీ వచ్చే వారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ను చూస్తే క్లారిటీ రాబోతుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆసియా కన్నీళ్లు పెట్టుకోవడం.. నూకరాజు ఆమె కాళ్లు పట్టుకోవడం తో ఇద్దరి మద్య రియల్‌ లవ్‌ అలాగే ఉంది.. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చర్చ జరుగుతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి