Home » Entertainment » Nookaraju Praveen Pavithra Getups In Mana Oori Devedu Event
Entertainment

Jabardasth Team : రోడ్డు మీద బిచ్చగాళ్లుగా మారిన జబర్దస్త్ గ్యాంగ్.. వీళ్లని అస్సలు గుర్తు పట్టలేరుగా

Authored By
aruna
The Telugu News | Published on: August 14, 2022, 12:40 pm
Advertisement

Jabardasth Team : మల్లెమాల టీం బుల్లితెరపై కొత్తగా ప్రయత్నిస్తుంది. ఎవ్వరూ ప్రయత్నించినట్టుగా ట్రై చేస్తుంటుంది. కామెడీ షో అయినా డ్యాన్స్ షో అయినా కూడా మల్లెమాల మార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు మల్లెమాల మీద జనాలు కాస్త గుర్రుగా ఉన్నారు. కిరాక్ ఆర్పీ ఆరోపణలు, ఆర్పీ చేసిన ఆరోపణలు మిగతా వారు ఖండించడం ఇలా.. మల్లెమాల మాత్రం ఎప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతూ వచ్చింది. ఇక వీరు ప్రతీ పండుగకు చేసే స్పెషల్ ఈవెంట్లు ఎప్పుడూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.

Advertisement

ప్రతీ పండుగకు కొత్తగా ఆలోచించి ఏదో ఒక ఈవెంట్ చేస్తుంటారు. మల్లెమాలను ఎంత మంది ట్రోల్ చేసినా, తిట్టినా కూడా ఈ విషయంలో అందరూ మెచ్చుకుంటారు. హిందూ పండుగలన్నింటికి మల్లెమాల స్పెషల్ ఈవెంట్లు చేస్తుంటుంది. తాజాగా వినాయక చవితి స్పెషల్ ప్రోమోను వదిలారు. మా ఊరి దేవుడు అంటూ ఓ ఈవెంట్ చేశారు. అందులో నాగినీడు, కుష్బూ, అన్నపూర్ణమ్మ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అందరూ వచ్చారు. ఇక ఇందులో ఓ పాత ఫార్మూలాను పట్టుకొచ్చారు.

Jabardasth Team Nookaraju Praveen Pavithra Getups in Mana Oori Devedu Event

Advertisement

Jabardasth Team : గుర్తుపట్టలేనంతగా..

ఆ మధ్య ఒకసారి వర్షకు పిచ్చిదానిలా గెటప్ వేసి.. రోడ్డు మీదకు అడుక్కునే దానిలా వదిలిన సంగతి తెలిసిందే. ఇమాన్యుయేల్‌ను సైతం అలాంటి గెటప్‌తోనే రోడ్డు మీదకు పంపించారు. అలా ఆ ఇద్దరి మీద చేసిన స్కిట్ బాగానే వర్కవుట్ అయింది. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఓ స్కిట్టే వేసినట్టున్నారు. కాకపోతే ఈ సారి గ్యాంగ్ మారినట్టు కనిపిస్తోంది. పవిత్ర, నూకరాజు, ప్రవీణ్, ఫైమా వంటి వారంతా బిచ్చగాళ్లలా మారి రోడ్డు మీదకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ప్రోమోలో వారిని గుర్తు పట్టడం కూడా కష్టంగా మారిపోయింది. ఇక ఇందులో ఆది, రాం ప్రసాద్, గెటప్ శ్రీను దుమ్ములేపినట్టు తెలుస్తోంది. డ్యాన్సులతో అందరూ రెచ్చిపోయారు. మొత్తానికి ఈ పండుగ ఈవెంట్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ ప్రోమోతోనే ఆ విషయం అర్థమవుతోంది. ఇక ఈ సారి ప్రదీప్ ఈ షోను నడిపిస్తుండటం విశేషం.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి