Anirudh : మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న సంగీత దర్శకులు ఎస్ ఎస్ థమన్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్. అలాగే, సీనియర్ సంగీత దర్శకుడు మెలోడి బ్రహ్మ మణిశర్మ..ఆయన తనయుడు మహతీ స్వర సాగర్..అనూప్ రుబెన్స్. వీరితో పాటు కొత్త సంగీత దర్శకులు, తమిళ పరిశ్రమ నుంచి వచ్చిన హిప్ హప్ తమిళ, గోపీసుందర్ లాంటివారూ ఉన్నారు. వీరిలో ఎందుకనో స్పెషల్ క్రేజ్ ఉన్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. తమిళంలో స్టార్ హీరోలందరి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అక్కడ ఆల్బంస్ బాగానే హిట్ అవుతున్నాయి.
తమిళ తంబీల పల్స్ బాగా తెలుసు కాబట్టి బీజీఎం కూడా ఏ హీరోకు ఎలా ఉండాలో అలా అదరగొడుతున్నాడు. అయితే, ఎందుకనో అనిరుధ్ మన తెలుగు హీరోలకు మాత్రం ఇప్పటివరకు సూపర్ హిట్ ఆల్బం ఒక్కటి కూడా ఇవ్వలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఖచ్చితంగా మ్యూజికల్
హిట్ అని ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా గట్టిగా ఫిక్స్ అయ్యారు. అలాంటి పవన్ సినిమాకు ఫ్లాప్ మ్యూజిక్ ఇచ్చాడు అనిరుధ్. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా చార్ట్ బస్టర్ కాలేకపోయింది.అంతేకాదు, నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతం అందించాడు.
ఈ సినిమాలోని సాంగ్స్ కూడా అంతంత మాత్రమే. అయినా కూడా మన వాళ్ళు అనిరుధ్ అంటే బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్.టి.ఆర్ 30కి సంగీతం అందిస్తున్నాడు. తారక్ అంటే సాంగ్స్ అదిరిపోవాలి. మరి ఆ రేంజ్‌లో ఆల్బం ఇస్తాడా లేదా చూడాలి. అయితే, తాజాగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా జెర్సీ ఫేం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా అనిరుధ్ నే అనుకుంటున్నారట. మరి ఇది నిజమా కాదా తెలియదు
గానీ, చరణ్ ఫ్యాన్స్ కొందరు వద్దన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.