Home » Entertainment » Original Dakshayani Is Seen In Part 2 Said By Anasuya
Entertainment

Anasuya : అసలైన ‘దాక్షాయణి’ని పార్ట్-2లో చూస్తారు.. నటి ‘అనసూయ’ కీలక వ్యాఖ్యలు!

Authored By
mallesh
The Telugu News | Published on: December 23, 2021, 7:40 pm
Advertisement

Anasuya : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప’ సినిమా గురించే టాక్ వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ మూవీ రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. కొన్ని సెంటర్ల నుంచి ఈ సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తున్నా మొదటి భాగంగాలో నటీనటుల గురించి పరిచయంతోనే సరిపోతుంది మిగతా స్టోరీ అంతా సెకండ్ పార్టులో ఉంటుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. అయితే, సెకండ్ పార్టులో మాత్రం పుష్పరాజ్ తన ప్రతాపం చూపిస్తాడంటూ ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Advertisement

పుష్ప ది రైజ్ సినిమాలో యాంకర్ అనసూయ దాక్షాయణి పాత్రలో కనిపించింది. ఇది వరకు ఎన్నడూ అలాంటి ప్రతి నాయకురాలి పాత్రలో అనసూయను ఊహించుకోని అభిమానులు పుష్పలో చూసి ఒక్కసారిగా థ్రిల్ అయిపోయారట.. తాజాగా పుష్ప సక్సెస్ మీట్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. దాక్షాయణి పాత్రలో తన నటనకు మంచి రెస్సాన్స్ వస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో దాక్షాయణి డోస్ సరిపోలేదని అభిమానులు చెబుతున్నారని మాట్లాడిన అనసూయ.. రెండో భాగంలో డోస్పెంచి ఆడుకుంటానని వ్యాఖ్యానించింది.

original dakshayani is seen in part 2 said by anasuya

Advertisement

Anasuya : సెకండ్ పార్టులో దాక్షాయణి డోస్ పెంచుతా..

ఇక దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఇంత మంచి సినిమాలో తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. పుష్ప సినిమాను ప్రతీ ఒక్కరు చూడాలని కోరింది. ఇలాంటి సినిమాలను తీయాలంటే అది మైత్రీ మూవీ మేకర్స్ మాతమ్రే సాధ్యం అవుతుందని, అంత కమిట్మెంట్‌తో వారు ఉంటారని చెప్పుకొచ్చింది ఈ హాట్ ముద్దుగుమ్మ..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి