Home » Entertainment » Pallavi Prashanth Trying For Rathika Rose In Bigg Boss Telugu 7
Entertainment

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో పులిహోర కలుపుతున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: September 6, 2023 12:35 pm
Advertisement

Bigg Boss 7 Telugu : మాట ముందు రైతు బిడ్డ.. మాట వెనకాల రైతు బిడ్డ. ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే రైతు బిడ్డవా? ఇంకెవ్వరూ లేరా? మన దేశంలో 90 శాతం మంది రైతులే. వాళ్లంతా రైతు బిడ్డలే. నువ్వొక్కడివే కాదు. రైతులను అడ్డంగా పెట్టుకొని ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నావా? రైతు బిడ్డ, రైతు బిడ్డ అని చెప్పి ఆ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రైతులను నువ్వు అడ్డంగా అవమానించి కానీ బయటికి వచ్చేలా లేవు. ఇంకోసారి రైతు బిడ్డ అనకు భయ్యా అంటూ నెటిజన్లు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అవుతున్నారు. నిజానికి ఒక రైతు బిడ్డగా ఎలాంటి సెలబ్రిటీ హోదా లేకున్నా ఒక సామాన్యుడికి బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కల్పించారు. హౌస్ లోకి వెళ్లాక పీకుతా, రక్కుతా.. రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా ఉంటదో చూపిస్తా అంటూ గప్పాలు కొట్టిన పల్లవి ప్రశాంత్ తీరా హౌస్ లోకి వెళ్లాక చేస్తున్న పనులు చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.

Advertisement

రతికతో పులిహోర కలపడం దగ్గర్నుంచి ఎప్పుడూ తన చుట్టూనే తిరుగుతూ ఉండటం మిగితా కంటెస్టెంట్లకు కూడా మింగుడు పడటం లేదు. రైతు బిడ్డ పులిహోర కలుపుతున్నాడు రోయ్.. నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వెలగబెట్టే ఘనకార్యం ఇదేనా బాబు అంటూ నెటిజన్లు అయితే ప్రశాంత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. చివరకు తాను రైతు బిడ్డ అని బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పుకోవడం కొందరు కంటెస్టెంట్లకు నచ్చడం లేదు. అందుకే కొందరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశారు.అసలు రతిక, పల్లవి ప్రశాంత్ ఈ ఇద్దరికీ ఎక్కడ కనెక్ట్ అయిందంటే.. ఇద్దరూ రైతు బిడ్డలే. రతిక కూడా రైతు బిడ్డ కావడంతో ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసే ఉంటున్నారు.

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో పులిహోర కలుపుతున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

Advertisement

Bigg Boss 7 Telugu : రతిక కూడా చనువు ఇస్తోందా?

అలాగే నవీన్ పొలిశెట్టి వచ్చి ఎవరు నీకు లక్కీ అనుకుంటున్నావో వాళ్లకు బ్యాండ్ పెట్టాలి అనగానే తెగ సిగ్గుపడుతూ రతికకు బాండ్ పెట్టేశాడు. అప్పటి నుంచి ఇద్దరూ అతుక్కుపోయారు. ఎక్కడ చూసినా ఇద్దరే. ఇద్దరు కలిసి అన్నం తినడం, ఇద్దరే సపరేట్ గా మాట్లాడుకోవడం.. నువ్వు నవ్వకు.. నాకు అదోలా ఉంది అని ప్రశాంత్ చెప్పడం, దానికి రతిక సిగ్గు పడుతూ ఇంకా నవ్వడం.. ఇవన్నీ చూస్తుంటే ఒక్క రోజులోనే ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనే అనుమానం కలగకమానదు. ఏది ఏమైనా ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ ఇలాంటి ట్రాప్స్ లో పడకుండా.. తన ఆట తాను ఆడి రైతు బిడ్డ సత్తా చాటాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి