Paruchuri fire on venkatesh and varun tej
Venkatesh – Varun Tej : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడితో సినిమాలు చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడం వలన తమ కెరీర్ కూడా సజావుగా సాగుతుందని, హిట్స్ వస్తాయని భావిస్తుంటారు. కానీ సక్సెస్ అనేది దర్శకుడు మేకింగ్‌తో పాటే కంటెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుందని తెలియక చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు.ఈ క్రమంలోనే వెంకటేశ్, వరుణ్ తేజ్ కూడా తొందపాటులో ఎఫ్-3 సినిమా చేశారని ప్రముఖ సీనియర్ రైటర్ పరుచూరి మండిపడ్డారు.అసలు ఎఫ్ 3 సినిమా స్టుప్పిడ్ అని చెప్పుకొచ్చారు. సీనియర్ హీరో వెంకటేశ్ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారని ప్రశ్నించారు. అయితే, ఇటీవల వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.ఈ సినిమాతో మరోసారి వెంకటేష్, వరుణ్ తేజ్ తమ కామెడీతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సినిమాపై చాలా మంది విమర్శలు కూడా చేశారు.
చాలా మంది ఎఫ్ 3 సినిమా డిజాస్టర్ అవుతుందని చెప్పారు. కానీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. సినిమాలో ఏం లాజిక్ లేదని చాలామంది సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేశారు. హాయిగా నవ్వుకునే సినిమా లో ఇలా లాజిక్స్ వెతుక్కోవడం ఏంటి అని సినిమా చూసిన చాలామంది దర్శకుడు అనిల్ రావిపూడిని విమర్శించారు. అయితే, తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విమర్శలు చేశారు.ఈ సినిమాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పరుచూరి.వెంకటేష్ ఏజ్ ఏంటో అందరికీ తెలుసు.అలాంటిది వెంకటేష్ మురళి శర్మ కొడుకుగా నటించడం పెద్ద పొరపాటు అని ఆయన అన్నారు. సాధారణంగా అయితే వెంకటేష్ ఇలాంటి స్టుపిడ్ కథలను అస్సలు ఓకే చేయరు.
Paruchuri fire on venkatesh varun tej
కానీ ఈ సినిమాకి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో నాకైతే అర్థం కావడం లేదు. అలాగే ఈ సినిమాలో సెకండాఫ్ లో మురళి శర్మ ని వరుణ్ తేజ్,వెంకటేష్ లు ఇద్దరు కొడుకులుగా నమ్మించే ప్రయత్నం చేయడం, అంతేకాకుండా తమన్నాకి మీసాలు పెట్టి అబ్బాయిలాగా చూపించడం ఇలాంటి సన్నివేశాలు ఏమాత్రం బాగాలేవని పరుచూరి విమర్శించారు. ఎఫ్2 సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే రియలిస్టిక్ సమస్యలను ఎంతో ఫన్నీగా చూపించారు. ఆ మూవీ చాలా బాగుంది.కానీ ఎఫ్ 3 సినిమా మొత్తం డబ్బు చుట్టే కథ మొత్తం నడిచేలా చూపించడం పెద్ద పొరపాటు అని పరుచూరి అన్నారు.
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
This website uses cookies.