Home » Entertainment » Pawan Kalyan And Vijay Deverakonda On The Same Screen
Entertainment

Pawan Kalyan : ఓకే స్క్రీన్ పై పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ .. కొత్త సినిమాలో స్పెషల్ క్యామియోపై ఆసక్తికర చర్చలు ..!

Authored By
Suma
The Telugu News | Published on: March 13, 2026, 3:00 pm
Advertisement

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఒకవైపు రాజకీయ బాధ్యతలను నిర్వహిస్తూనే మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ మరోసారి భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్నారు. ఇదే సమయంలో ఆయన కొత్త ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి.

Advertisement

Pawan Kalyan : ఓకే స్క్రీన్ పై పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ .. కొత్త సినిమాలో స్పెషల్ క్యామియోపై ఆసక్తికర చర్చలు ..!

Pawan Kalyan : వరుస సినిమాలతో పవన్ బిజీ

ఈ ఏడాది ప్రారంభంలో పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే టాక్ వినిపించింది. అయితే ఆ తరువాత విడుదలైన OG మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయన నటించిన మరో భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Pawan Kalyan : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాపై టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారని సమాచారం. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్, రేస్ గుర్రం, ఊసరవెల్లి, ధృవ, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అయితే ఆయన చివరిగా తెరకెక్కించిన ఏజెంట్ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇందులో అఖిల్ అక్కినేని హీరోగా నటించగా మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ భారీ హిట్ సాధించాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan : స్పెషల్ క్యామియోలో విజయ్ దేవరకొండ?

ఈ సినిమాలో ఒక కీలక స్పెషల్ క్యామియో పాత్ర ఉండబోతుందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. కథలో ఆ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో మంచి ఇమేజ్ ఉన్న స్టార్ హీరోను తీసుకోవాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. దీంతో ఈ పాత్ర కోసం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. యూత్‌లో పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ ఇద్దరికీ భారీ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే థియేటర్లు కుదిపేయడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్‌కు కూడా ఇది మంచి బూస్ట్ కావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వి ఇస్మాయిల్ పేరు వినిపిస్తోంది. సోషల్ మీడియాలో హిందీ, తెలుగు, తమిళ పాటలకు చేసిన డ్యాన్స్ వీడియోలతో ఆమెకు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అదే క్రేజ్‌తో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఆమె నటిస్తే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది. సినిమా యూనిట్ నుంచి అప్డేట్ రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి