Home » Entertainment » Pawan Kalyan Ok To Hari Hara Veeramallu Shooting
Entertainment

Pawan Kalyan : నిర్మాతలకు పవన్‌ అభయం.. అయినా భయం గుప్పిట్లోనే నిర్మాతలు

Authored By
aruna
The Telugu News | Published on: September 10, 2022, 2:00 pm
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను చేసేందుకు కమిట్ అవుతున్నాడు. కానీ అందులో ఎక్కువ శాతం సినిమాలను పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదంటూ ఆయన సన్నిహితులే స్వయంగా చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం మొదలు పెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఇప్పటి వరకు పూర్తి చేయలేక పోయాడు. రాజకీయాలతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నప్పటికీ సమయాన్ని కేటాయించలేక పోతున్నాడు. అయినా కూడా డబ్బులు అవసరం ఉండటంతో వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఏదోరకంగా వీలు కల్పించుకొని ఆ సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఒక రీమిక్స్ సినిమాను చేసేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు. ఆ సినిమాకు సంబంధించి డేట్లు కూడా ఇచ్చాడు. కానీ తాజాగా మళ్లీ ఆ డేట్ లను హరిహర వీరమల్లు సినిమా నిర్మాతలకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమాను వచ్చే సంవత్సరంలో పూర్తి చేద్దాం అన్నట్లుగా మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఉన్నాడని.. అందుకే రీమేక్ చేసేందుకు ఓకే చెప్పాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. దాంతో ఇప్పటికే భారీగా ఖర్చుపెట్టిన హరిహర వీరమల్లు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు.

pawan kalyan ok to hari hara veeramallu shooting

Advertisement

వారికి తప్పకుండా ఇదే ఏడాదిలో సినిమాను పూర్తి చేద్దామని.. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా విడుదలకు సిద్ధం చేద్దామని మాటిచ్చాడట. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంత వరకు నిలబడతాడో అని ఇప్పటికీ కూడా ఆ సినిమా యొక్క నిర్మాతలు భయం భయంగానే ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే చాలా గొప్ప విషయం అంటూ చాలామంది నిర్మాతలు ఆయనతో సినిమాను తీసేందుకు ముందుకు వస్తారు. తీరా ఆయనతో సినిమా మొదలు పెట్టిన తర్వాత దాన్ని పూర్తి చేయలేక నానా ఇబ్బందులు పడుతూ పీకల్లోకి కష్టాల్లో చిక్కుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ విమర్శలను పట్టించుకోడు కానీ ఆయన అభిమానులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి