Categories: EntertainmentNews

Pawan Kalyan : గేమ్ ఛేంజ‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్.. మూలాలు మ‌రిచిపోవద్దు అంటూ చుర‌క‌లు..!

Advertisement
Advertisement

Pawan Kalyan : రామ్ చ‌ర‌ణ్‌ Ram Charan , కియారా అద్వాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం గేమ్ ఛేంజ‌ర్. ఈ మూవీ జన‌వ‌రి 10న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుపుకుంటుంది. అయితే తాజాగా రాజ‌మండ్రిలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడకు రావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృషి చేశారు. వారికి నా నమస్కారాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మా నాన్న రామ్ చరణ్ అనే పేరు పెట్టారు. చిరంజీవి నాకు తండ్రి సమానులు, వదిన తల్లితో సమానం. అందుకే రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు. చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఏడిపించేవాడిని. రామ్ చరణ్ తెల్లవారు ఝామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు.

Advertisement

Pawan Kalyan : గేమ్ ఛేంజ‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్.. మూలాలు మ‌రిచిపోవద్దు అంటూ చుర‌క‌లు..!

Pawan Kalyan : మూలాలు మ‌రిచిపోవ‌ద్దు..

రామ్ చరణ్ అంత క్రమశిక్షణగా ఉండేవాడు. రామ్ చరణ్ లో ఇంత శక్తి సమర్థత ఉందని తెలియదు. సినిమాల్లో తప్ప రామ్ చరణ్ డాన్స్ చేయడం చూడలేదు. కానీ అద్భుతమైన డాన్సర్. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ నటన చూసి అవార్డు రావాలని కోరుకున్నాను. భవిష్యత్ లో రావాలి. గోదావరి తాలూకు కల్చర్ రామ్ చరణ్ కి తెలియదు. అయినా గొప్పగా నటించాడు. చిరంజీవికి తగ్గ వారసుడు. అందుకే గ్లోబల్ స్టార్ అయ్యాడు. మా అన్నయ్య అంటే నాకు ఎందుకు గౌరవం అంటే… మొగల్తూరు నుండి వెళ్లి ఎవరి అండలేకుండా ఎదిగారు. ఆయన ఒక్కడూ పెరిగి మా అందరికీ ఊతం ఇచ్చాడు. నాకు ప్రజా సేవ చేసే అవకాశం రావడానికి కూడా చిరంజీవినే కారణం.

Advertisement

పబ్లిక్ ఫంక్షన్ పెట్టడానికి నేను ఆలోచించాను. కానీ తప్పదు.మీ క్షేమం మాకు ముఖ్యం. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా ఇంటికి క్షేమంగా వెళ్ళండి. అలాగే అడగ్గానే టికెట్స్ రేట్లు ఎందుకు పెంచాలి అని అడుగుతారు. ఇది డిమాండ్ అండ్ సప్లై. బడ్జెట్స్ పెరిగిపోయాయి. తెలుగు సినిమాలు వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. పెరిగిన ప్రతి రూపాయికి తిరిగి ప్రభుత్వానికి టాక్స్ వస్తుంది. నా సినిమాలకు టికెట్స్ పెంచలేదు. సినిమాకు రాజకీయ రంగు రుద్ద వద్దు. వివిధ పరిశ్రమలకు చెందినవారు ఒక సినిమాకు పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వలె చిరంజీవి, ప్రభాస్, మహేష్ నాయకులను కలవాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమ అంటే మాకు గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఏనాడూ చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. ..

హీరోలు, దర్శకులు, నిర్మాతలు విలువలు పాటించాలి. వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు రావాలి. ప్రజలకు ఆమోద్యయోగ్యంగా ఉండే సినిమా రావాలి. పెరిగిన టికెట్స్ ధరల వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గేమ్ ఛేంజర్ యూనిట్ కి శుభాకాంక్షలు. అయితే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అనేది మూలాలు మర్చిపోకూడదని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు పవన్‌. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. పవన్‌ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్‌ వ్యాఖ్యలను అల్లు అర్జున్‌ సంఘటనతో ముడిపెడుతున్నారు నెటిజన్లు. `పుష్ప 2` సినిమా విషయంలో అల్లు అర్జున్‌ అతి చేశారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Recent Posts

Budhaditya Rajyoga : ఈ రాశుల వారు రాసి పెట్టుకోండి… తిరుగులేని రాజయోగం..

Budhaditya Rajyoga :గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు, తెలివితేటలకు, తార్కానికి, పెట్టుబడి వ్యాపారులకు కారణంగా పరిగణించబడే బుధుడు యొక్క ప్రభావం…

32 mins ago

Anasuya Bharadwaj : మొన్న అలా ఈరోజు ఇలా.. అనసూయ శారీ లుక్స్ అదుర్స్..!

Anasuya Bharadwaj  : స్టార్ యాంకర్ అనసూయ Anchor Anasuya Bharadwaj ఏం చేసినా సరే దానికో స్పెషాలిటీ ఉంటుంది.…

4 hours ago

Amala Paul : ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా త‌న కొడుకుతో క్యూట్ పిక్స్ షేర్ చేసిన అమ‌లాపాల్‌

Amala Paul :  తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నటి అమలా పాల్ త‌ల్లైన…

7 hours ago

Daku Maharaaj : డాకు మహారాజ్ బిజినెస్ ఎంత.. ఎంత తెస్తే సూపర్ హిట్టో తెలుసా..?

Daku Maharaaj : నందమూరి బాలకృష్ణ Balakrishna నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా…

10 hours ago

Game Changer : గేమ్ ఛేంజర్ శంకర్ కంబ్యాక్ చూస్తారు.. మెగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చిన దిల్ రాజు..!

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. శంకర్ Shankar…

11 hours ago

Pawan Kalyan : గేమ్ ఛేంజ‌ర్ ఈవెంట్.. మృతుల‌కు దిల్‌రాజు, ప‌వ‌న్‌కళ్యాణ్ ఆర్తిక సాయం..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఏడీబీ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి…

13 hours ago

Allu Arjun : కిమ్స్‌ హాస్పిటల్ కు అల్లు అర్జున్.. షరతులతో అనుమతిచ్చిన పోలీసులు..!

Allu Arjun : పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన ఘటన్లో రేవతి అనే మహిళ మృతి…

13 hours ago

KTR : సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్‌

KTR  : తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఇప్పుడు అనుముల కుట్ర శాఖ Anumula Conspiracy Branch గా…

14 hours ago

This website uses cookies.