Pawan Kalyan : గేమ్ ఛేంజర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్.. మూలాలు మరిచిపోవద్దు అంటూ చురకలు..!
ప్రధానాంశాలు:
Pawan Kalyan : గేమ్ ఛేంజర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్.. మూలాలు మరిచిపోవద్దు అంటూ చురకలు
Pawan Kalyan : రామ్ చరణ్ Ram Charan , కియారా అద్వాని ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీ జనవరి 10న విడుదల కానున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ జరుపుకుంటుంది. అయితే తాజాగా రాజమండ్రిలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగగా, ఈ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇక్కడకు రావడానికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కృషి చేశారు. వారికి నా నమస్కారాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మా నాన్న రామ్ చరణ్ అనే పేరు పెట్టారు. చిరంజీవి నాకు తండ్రి సమానులు, వదిన తల్లితో సమానం. అందుకే రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు. చిన్నప్పుడు రామ్ చరణ్ ని ఏడిపించేవాడిని. రామ్ చరణ్ తెల్లవారు ఝామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు.

Pawan Kalyan : గేమ్ ఛేంజర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్.. మూలాలు మరిచిపోవద్దు అంటూ చురకలు..!
Pawan Kalyan : మూలాలు మరిచిపోవద్దు..
రామ్ చరణ్ అంత క్రమశిక్షణగా ఉండేవాడు. రామ్ చరణ్ లో ఇంత శక్తి సమర్థత ఉందని తెలియదు. సినిమాల్లో తప్ప రామ్ చరణ్ డాన్స్ చేయడం చూడలేదు. కానీ అద్భుతమైన డాన్సర్. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ నటన చూసి అవార్డు రావాలని కోరుకున్నాను. భవిష్యత్ లో రావాలి. గోదావరి తాలూకు కల్చర్ రామ్ చరణ్ కి తెలియదు. అయినా గొప్పగా నటించాడు. చిరంజీవికి తగ్గ వారసుడు. అందుకే గ్లోబల్ స్టార్ అయ్యాడు. మా అన్నయ్య అంటే నాకు ఎందుకు గౌరవం అంటే… మొగల్తూరు నుండి వెళ్లి ఎవరి అండలేకుండా ఎదిగారు. ఆయన ఒక్కడూ పెరిగి మా అందరికీ ఊతం ఇచ్చాడు. నాకు ప్రజా సేవ చేసే అవకాశం రావడానికి కూడా చిరంజీవినే కారణం.
పబ్లిక్ ఫంక్షన్ పెట్టడానికి నేను ఆలోచించాను. కానీ తప్పదు.మీ క్షేమం మాకు ముఖ్యం. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా ఇంటికి క్షేమంగా వెళ్ళండి. అలాగే అడగ్గానే టికెట్స్ రేట్లు ఎందుకు పెంచాలి అని అడుగుతారు. ఇది డిమాండ్ అండ్ సప్లై. బడ్జెట్స్ పెరిగిపోయాయి. తెలుగు సినిమాలు వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. పెరిగిన ప్రతి రూపాయికి తిరిగి ప్రభుత్వానికి టాక్స్ వస్తుంది. నా సినిమాలకు టికెట్స్ పెంచలేదు. సినిమాకు రాజకీయ రంగు రుద్ద వద్దు. వివిధ పరిశ్రమలకు చెందినవారు ఒక సినిమాకు పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వలె చిరంజీవి, ప్రభాస్, మహేష్ నాయకులను కలవాల్సిన అవసరం లేదు. చిత్ర పరిశ్రమ అంటే మాకు గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఏనాడూ చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. ..
హీరోలు, దర్శకులు, నిర్మాతలు విలువలు పాటించాలి. వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు రావాలి. ప్రజలకు ఆమోద్యయోగ్యంగా ఉండే సినిమా రావాలి. పెరిగిన టికెట్స్ ధరల వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గేమ్ ఛేంజర్ యూనిట్ కి శుభాకాంక్షలు. అయితే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో అనేది మూలాలు మర్చిపోకూడదని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు పవన్. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది. పవన్ ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే పవన్ వ్యాఖ్యలను అల్లు అర్జున్ సంఘటనతో ముడిపెడుతున్నారు నెటిజన్లు. `పుష్ప 2` సినిమా విషయంలో అల్లు అర్జున్ అతి చేశారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.