People protest At Sudigali Sudheer Movie Shooting
సుడిగాలి సుధీర్‌కు తాజాగా ఓ ఎదురు దెబ్బ తగిలింది. జన సమూహంలో షూటింగ్ చేయడం ప్రస్తుతం ఎంత ప్రమాదం అందరికీ తెలిసిందే. పైగా ఊర్లో లేదా కాలనీలో సినిమా షూటింగ్‌లు జరపడం కూడా ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. తాజాగా హైద్రాబాద్‌లోని ఓ కాలనీలో సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్‌లో గొడవలు జరిగాయి. అక్కడి స్థానికులు వచ్చి షూటింగ్‌ను అడ్డుకున్నారు.
People protest At Sudigali Sudheer Movie Shooting
సుడిగాలి సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ను జనం అడ్డుకున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బీ బ్లాక్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సినిమా షూటింగ్‌ను ఆ కాలనీలో చేపట్టారు. షూటింగ్ స్టార్ట్ అయిన కాసేపటికే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కరోనా తాండవం చేస్తోన్న సమయంలో ఇలా తమ కాలనీలో షూటింగ్ చేయడమేంటని అక్కడి వారు ప్రశ్నించారు.
ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకున్నారు. అయితే ముందస్తు అనుమతి తీసుకుని షూటింగ్ చేపట్టారని, ఎలా అడ్డుకుంటారని పోలీసులు ప్రశ్నించడంతో అక్కడి జనాలు శాంతించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సుధీర్ సినిమా ఇలా వార్తల్లో వైరల్ అయింది. కానీ కరోనా విస్తరిస్తున్న వేళ ఇలా జన సమూహాలు తిరిగే ప్రదేశాల్లో షూటింగ్‌లంటే కత్తి మీద సాము వంటిదే.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.