Ponniyin Selvan 2 : మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం మణిరత్నం చాలా ఏళ్ల నుంచి శ్రమిస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి తెరకెక్కించాలనుకున్న ఈ సినిమాను చివరకు రెండు భాగాలుగా సినిమా తీశారు మణిరత్నం. కొలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ ఇది. గత సంవత్సరమే పార్ట్ వన్ విడుదల కాగా.. భారీ విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు.. బాక్సాఫీసు వద్ద రూ.600 కోట్లు కొల్లగొట్టింది. పార్ట్ వన్ విజయం కావడంతో వెంటనే పార్ట్ 2 షూటింగ్ ను పూర్తి చేసి..
ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇది పాన్ ఇండియా మూవీగా రెండు పార్టులు విడుదలయ్యాయి. పార్ట్ 2 సినిమాకు కూడా బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదల అయి మూడు రోజులు కూడా కాలేదు అప్పుడే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసిందట. విడుదల అయిన రోజు ఈ సినిమాకు అంతగా క్రేజ్ రాలేదు కానీ.. విడుదల అయినా రెండో రోజు నుంచి ఈ సినిమాకు విపరీతంగా క్రేజ్ వస్తోంది.
ప్రస్తుతం థియేటర్లలో ఏ పెద్ద సినిమాలు లేవు. అఖిల్.. ఏజెంట్ ఉన్నప్పటికీ ఆ సినిమా భారీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ పొన్నియిన్ సెల్వన్ 2 మూవీకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పార్ట్ వన్ ని మించి ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి.. వెయ్యి కోట్ల మైలురాయి దాటి తమిళం ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు తమిళ్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్లు దాటిన ఏ సినిమా లేదు. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే.. త్రిష, ఐశ్వర్యరాయ్ వంటి హీరోయిన్స్ కూడా నటించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.