Dhee Choreographer Chaitanya Master commits suicide
Dhee Choreographer Master Chaitanya : టీవీల్లో నటించే వాళ్లు, కనిపించే వాళ్ల లైఫ్ స్వర్గం అని, వాళ్లకు చాలా డబ్బులు ఉంటాయని అంతా అనుకుంటారు కానీ.. కనిపించేదంతా నిజం కాదు అని ఈ ఘటనతో తేలిపోయింది. అవును.. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఢీ కొరియోగ్రాఫర్ మాస్టర్ చైతన్య గురించి. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొని చివరకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. రిచ్ లైఫ్ కు అలవాటు పడే చాలా మంది సెలబ్రిటీలు అప్పుల మీద అప్పులు చేసి వాటిని తీర్చలేక చివరకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
Dhee Choreographer Chaitanya Master commits suicide
నెల్లూరులోని క్లబ్ హోటల్ లో చైతన్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తను చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు అప్పులు ఎక్కువయ్యాయని.. వాటిని తీర్చలేకపోతున్నానని.. ఇక ఇదే తనకు చివరి రోజు అని.. అందరినీ బాధపెడుతున్నందుకు క్షమించండి.. ఈ వీడియో తర్వాత తన జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. నాకు ఉన్న అప్పులను తీర్చడానికి చాలా ప్రయత్నాలు చేశా. కానీ నాకు వస్తున్న పారితోషికంతో అప్పులను తీర్చలేను.
అది సాధ్యం కాదు కాబట్టే నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా. నా దగ్గర సాయం పొందిన చాలామంది నాకు సాయం చేశారు.. అంటూ సూసైడ్ వీడియోలో చైతన్య చెప్పుకొచ్చాడు. చైతన్య ఆత్మహత్యపై ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఢీ షో నిర్వాహకులు, జడ్జిలు, ఇతర కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్స్ షాక్ అయ్యారు. ఎన్నో కార్యక్రమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి, పలు కార్యక్రమాల్లో సందడి చేసిన చైతన్య.. ఇంత సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం దారుణం అని ఆందోళన వ్యక్తం చేశారు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.