Home » Entertainment » Pooja Hegde Pics Liked By Cricketer Ruturaj Gaikwad
Entertainment

Pooja Hegde : పూజా హెగ్డే పిక్స్‌ని లైక్ చేసిన క్రికెట‌ర్.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: April 13, 2022, 9:30 pm
Advertisement

Pooja Hegde: పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఫుల్ ఫామ్‌లో ఉంది. వ‌ర‌స పెట్టి సినిమాలు చేస్తుంది. మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్న క్ర‌మంలో రెమ్యున‌రేష‌న్ కూడా పెంచింది. ఈ అమ్మ‌డు ఐటెం సాంగ్స్‌కి కూడా సై అంటుంది. గతంలో ‘రంగస్థలం’ మూవీలో ‘జిల్‌ జిల్‌.. జిగేల్‌రాణి’ అంటూ ఓ ప్రత్యేక గీతం చేసి అభిమానులను ఓ ఊపు ఊపేసిన పూజా.. అల్లు అర్జున్‌తో బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి భేష్ అనిపించుకుంది. ఇక రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘బీస్ట్’ సినిమాలో అరబిక్ కుతు సాంగ్ చేసి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసింది. ఈ క్రమంలోనే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రాబోతున్న ఫన్ రైడ్ F3లో పూజా స్పెషల్ పర్‌ఫార్‌మెన్స్ చూడబోతున్నామట.

Advertisement

పూజా న‌టించిన బీస్ట్ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వ‌స్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా చిత్ర ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ యాక్షన్ చిత్రానికి వేల సంఖ్యలో అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్‌లకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో బీస్ట్ స్టార్ కాస్ట్ కూడా థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం ప్రత్యేకంగా నిలిచింది. ‘బీస్ట్’ హీరోయిన్ పూజా హెగ్డే , అపర్ణా దాస్, అనిరుధ్ రవిచందర్ , నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి బీస్ట్ టీమ్ పలువురు ప్రముఖులు, ప్రేక్షకులతో తొలి షోని వీక్షించారు.

pooja hegde pics liked by cricketer Ruturaj Gaikwad

Advertisement

Pooja Hegde : క్రికెట‌ర్ బుక్క‌య్యాడు…

బీస్ట్ సినిమా ప్ర‌మోష‌న్స్ తో గ‌త కొద్ది రోజులుగా బిజీగా ఉన్న పూజా హెగ్డే తెగ ఫొటో షూట్స్ చేసింది. వెరైటీ దుస్తుల‌లో ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ మాములుగా లేదు. అయితే బుట్టబొమ్మ పూజా హెగ్దే ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. వాటిని లైక్ చేశాడో క్రికెటర్. అతనెవరో కాదు రుతురాజ్ గైక్వాడ్. అంతే, రుతురాజ్ మీద ట్రోలింగ్ షురూ అయ్యింది. గత కొన్ని మ్యాచ్‌లనుండీ మనోడి ఆటతీరు అత్యంత అధ్వాన్నంగా తయారైంది. స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు. ఆ స్కోర్లను పేర్కొంటూ, హీరోయిన్ల మీద ఫోకస్ తగ్గించి.. ప్రత్యర్థి విసిరే బంతుల మీద ఫోకస్ పెట్టు.. అంటూ ఒకింత వల్గర్‌గానే ట్రోల్ చేస్తున్నారు రుతురాజ్ గైక్వాడ్‌ని.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి