
Pooja Hegde Rashmika Mandanna Going to put the check Sreeleela
Sreeleela : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగతా అన్నీ ఇండస్ట్రీలలో ఎప్పటికప్పుడు కొత్త సరుకు దిగుతూనే ఉంటుంది. పాత సరుకు కాస్త మూలన పడుతూనే ఉంటుంది. అంటే కొత్త హీరోయిన్ల ధాటికి ఎంత క్రేజ్ ఉన్న హీరోయిన్స్ అయినా కాస్త పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగుతున్న పూజా హెగ్డే, రష్మిక లకు ఈ ఏడాది వరుస ప్లాప్స్ వచ్చి పడ్డాయి. పూజా హెగ్డే, రష్మిక మందన్న నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే వీరికి ఇప్పుడు ఇబ్బందులను తెచ్చిందని టాక్ వినిపిస్తోంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నలకు పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల రూపంలో ఝలక్ తగలనుంది.
క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శ్రీలీల కృతిశెట్టి మాదిరిగా ఎడాపడా సినిమాలు కమిటవకుండా ఆచితూచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుంది. శ్రీలీల ఎక్స్ ప్రెషన్లు అద్భుతంగా పలికిస్తుందని డ్యాన్సులు బాగా చేస్తుందని మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మెల్లగా శ్రీలీలకు ఆఫర్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే, బాలయ్య – అనిల్ రావిపూడి కాంబో మూవీలో బాలయ్య కూతురిగా శ్రీలీల నటిస్తుంది. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన శ్రీలీల ఫ్యూచర్ లో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజ రవితేజ, నితిన్, అలాగే, మరో పెద్ద సంస్థలో సినిమాలు ఒప్పుకుంది శ్రీలీల.
Pooja Hegde Rashmika Mandanna Going to put the check Sreeleela
అంతేకాదు, తమిళం, కన్నడలో కూడా అమ్మడికి బాగా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఓ తమిళ సినిమానూ కమిటైందట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీ లో టాక్. శ్రీలీల ఇప్పుడు చేసే సినిమాలు కూడా సక్సెస్ అయితే ఈ యంగ్ బ్యూటీ క్రేజ్ మరింత పెరగడం గ్యారంటీ. యూత్ లో శ్రీలీలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీలీల క్రేజ్ ను చూసి మిగతా హీరోయిన్లు కూడా కంగుతింటున్నారు. ఈమెకు యంగ్ హీరోలకు జోడీగా ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలోనూ ఓ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలీల నిజంగానే మహేశ్ సినిమా చేసి హిట్ అందుకుంటే మాత్రం గ్యారెంటీగా రష్మిక, పూజాలకు గటి స్ట్రోక్ తగలడం ఖాయం.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.