Home » Entertainment » Pooja Hegde Who Made A Mistake
Entertainment

pooja hegde : తప్పు చేసిన పూజా హెగ్దే.. అది సమంతకు కలిసివచ్చిందా..?

Authored By
mallesh
The Telugu News | Updated on: November 26, 2021 7:46 pm
Advertisement

Puja hegde : పూజా హెగ్దే… టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ముకుంద మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ అమ్మడు.. ఆ మూవీ హరో వరుణ్ తేజ్‌కు ఫస్ట్ మూవీ. ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఆ భామకు ఆఫర్స్ పెరిగాయి. ఒక లైలా కోసం మూవీ వరకు ట్రెడిషనల్ యాంగిల్ లో ఉన్న ఈ బుట్టబొమ్మ.. డీజే మూవీలో బీభత్సమైన ఎక్పోజింగ్ చేసింది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు ఆఫర్స్ వరుస కట్టాయి. చేతినిండా సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ సరసన చేరింది.

Advertisement

pooja hegde who made a mistake

pooja hegde : గోల్డెన్ చాన్స్ మిస్..?

హిట్స్, ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం మూవీ పెద్ద హిట్ కావడంతో ఈ అమ్మడు రేంజ్ పూర్తిగా పెరిగింది. ఇక అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది ఈ భామ.ప్రస్తుతం చేతినిండా మూవీస్‌తో బిజీ బిజీగా ఉన్న ఈ బుట్టబొమ్మ.. ఓ మంచి ఆఫర్‌ను వదులుకున్నదని టాక్.. ఇది సమంతాకు కలిసివచ్చిందట.. మహేశ్ బాబు సర్కారు వారి పాట మూవీ చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడు.

Advertisement

ఇందులో హీరోయిన్ కోసం పూజా హెగ్దేను సంప్రదించిందట మూవీ యూనిట్. కానీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులు ఉండటంతో అందుకు పూజా నో చెప్పిందట. దీంతో ఆ మూవీకి సంబంధించిన ఓ మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకు సమంతాను ఫైనల్ చేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇంకా ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. పూజా హెగ్దే తప్పు చేసిందని, మహేశ్ బాబుతో యాక్ట్ చేసే గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి