
poonam kaur interesting comments on tollywood heroes
Poonam Kaur : బాలీవుడ్‌లో కంగనా రనౌత్ కాంట్రవర్సీస్‌తో ఎలా వార్తలలో నిలుస్తుందో, టాలీవుడ్‌లో కూడా పూనమ్ అలానే సెన్సేషన్ అవుతుంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంత కాదు. పీకే లవ్స్ అంటూ ట్విటర్ ఖాతాలో పేరు మార్చుకుని అందరిని ఆలోచనలో పడేసింది. ఇక ఇటీవల దాని అర్థం చెబుతూ.. పీ అంటే పూనమ్.. కే అంటే కౌర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. చాలా రోజుల తర్వాత ‘నాతి చరామి’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన పూనమ్ పలు ఇంటర్య్వూలో అనేక విషయాలపై స్పందిస్తుంది.
నాతి చరామి మూవీ మార్చి 10న ఈ మూవీ అమెజాన్, హంగామా, సోనీ, టాటా స్కై, ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీమ్, ఎంఎక్స్ ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ప్రభాస్ మంచివాడని, అతడిలాంటి వ్యక్తి పరిశ్రమలో ఎవరు లేరంటూ కితాబు ఇచ్చింది. ఇక చిరంజీవి అంటే తనకు చాలా అభిమానం అని, నాగార్జున కుటుంబాన్ని చూస్తే ముచ్చటేస్తుందని పేర్కొంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పూనమ్ కౌర్. చరణ్ గురించి చాలా విషయాలను చెప్పాలని, అయితే ఇప్పుడు సరైన సమయం కాదు సస్పె న్స్‌కు తెరలేపింది.
poonam kaur interesting comments on tollywood heroes
అంతేకాదు సమయం వచ్చినప్పడు చరణ్ గురించి తప్పకుండ మాట్లాడతానంటూ పూనమ్ వ్యాఖ్యానించింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. మరి పూనమ్ దాచిన ఆ సీక్రెట్ సంగతులు ఏంటని తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదేమో..!నటిగా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్ సినిమాల కంటే ఈ మధ్య సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటోంది. ప్రస్తుతం పూనమ్ కౌర్ ఏం మాట్లాడినా.. అది చాలావరకు కాంట్రవర్సీకి దారితీస్తోంది. ఇప్పటికే ట్విటర్ వేదికగా పలువురిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్.. ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తుంది..
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.