Poorna Gets Fires On Emmanuel For Touching Her In Sridevi Drama Company
Emmanuel : బుల్లితెరపై ఒక్కోసారి ఏది సెన్సేషన్ అవుతుందో చెప్పలేం. ఎవరు ఎప్పుడు ఎలా కాంట్రవర్సీలోకి ఎక్కేస్తారా? తెలియదు. అయినా కామెడీ షోలు, సింగింగ్ షోలు అంతా కూడా డైరెక్షన్ టీం చెప్పినట్టు చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు మాత్రం కావాలనే అలా చేస్తారా? లేదంటే ఫ్లోలో అలా జరుగుతుందా? అనేది చెప్పలేం. తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ప్రోమో చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎన్నో కొత్త వింతలు జరిగాయి. శ్రీదేవీ డ్రామా కంపెనీ రూపురేఖలే మారిపోయాయి.
ఇంద్రజ కనిపించలేదు, సుధీర్ యాంకర్‌గా రానేలేదు. ఇక ఇంద్రజ స్థానంలో పూర్ణ, సుధీర్ ప్లేస్‌లో రష్మీ కనిపించింది. అయితే మొత్తానికి ఇప్పుడు పూర్ణ వచ్చీ రాగానే తన మార్క్ చూపించింది. గొడవలకు దిగింది. ఒకరిని కార్నర్ చేసేసింది. ఇమాన్యుయేల్ తనను అసభ్యకరంగా తాకాడంటూ నానా హంగామా చేసేశాడు. అలా ఎలా టచ్ చేస్తావ్ అంటూ ఏడ్చేసినంత పని అయింది. అయితే ఇమాన్యుయేల్ ఏమీ కావాలని అలా చేసినట్టు కనిపించదు. ఏదో క్యాజువల్‌గానే చేయి వేశాడు.
అయితే అలా తన అనుమతి లేకుండా భుజం మీద చేతులు వేయడంతో పూర్ణ హర్ట్ అయినట్టుంది.
Poorna Gets Fires On Emmanuel For Touching Her In Sridevi Drama Company
ఇక ఇమాన్యుయేల్ మాత్రం పూర్ణ అలా అనడంతో తెల్లమొహం వేసేశాడు. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కో ఆర్టిస్టులంతా వచ్చి సర్ది చెప్పేందుకు చూసినట్టు తెలుస్తోంది. ఇంతలో మరో వైపు రష్మీ కళ్లు తిరిగిపడిదపోయింది. అలా ఆ గొడవ.. ఇటు ఇలా కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రోమో బాగానే హీటెక్కేసింది. మొత్తానికి ఈ వారం మాత్రం నానా రచ్చ జరిగేట్టు కనిపిస్తోంది. అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీలో టీఆర్పీ స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
ఇమాన్యుయేల్‌ను చివరకు బక్రా చేసేలా ఉన్నారు. కొంపదీసి చివరకు ప్రాంక్ అని పూర్ణ ప్లేట్ తిప్పేస్తుందేమో చూడాలి. అసలేం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి సుధీర్ లేని లోటు మాత్రం షోలో కనిపిస్తోంది. ఢీ షోలో పూర్ణ బుగ్గలు కొరకడం, హగ్గులు ఇవ్వడం కంటే ఇదేమీ పెద్ద నేరం కాదన్నట్టుగా జనాలు కామెంట్లు పెడుతున్నారు.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.