poorna shake legs with kalavathi dance
Poorna : పూర్ణ.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. పలు సినిమాలలో నటించిన పూర్ణ రియాలిటీ షోలతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు అయ్యారు. డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా ఆమె నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు. అయితే లేటెస్ట్ సీజన్ ఢీ 14 నుండి పూర్ణ తప్పుకున్నారు. కారణం ఏదైనా ప్రియమణి కొనసాగుతుండగా పూర్ణ మాత్రం ఢీ 14 చేయడం లేదు.త్రీ రోజెస్ తో ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ పూర్ణ . కామెడీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 3 రోజెస్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ ఉమన్ ఇందు పాత్రలో పూర్ణ ఆకట్టుకున్నారు. ‘తీస్ మార్ ఖాన్’ మూవీలోనూ నటించింది పూర్ణ.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూర్ణ అప్పుడప్పుడు అందాల ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ కి మాంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కళావతి సాంగ్‌కి అద్దిరిపోయే స్టెప్పులు వేసింది. మహేష్ బాబు మాదిరిగా పూర్ణ వేసిన డ్యాన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం పూర్ణ డ్యాన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. కళావతి అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ అందర్నీ మెప్పిస్తుంది. ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి విడుదలైన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో వెళ్తూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటీవల ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలైన ఈ సాంగ్ బాగా పాపులర్ అయింది.
poorna shake legs with kalavathi dance
ఇందులో మహేష్ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక అప్పట్నుంచి ఈ పాటతో పాటు మహేష్ స్టెప్పులు వేస్తూ రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రేక్షకులు, నెటిజన్లతో పాటు స్టార్స్ సైతం కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇటీవలే మహేష్ కూతురు సితార, హీరోయిన్ కీర్తి సురేష్ లు కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి దుమ్ము దులిపేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను మే 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.