
Prabhas in love with kriti sanon
Prabhas : టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ మొదటి నుండి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఆయన ఖాతాలో ఇప్పుడు అరడజనుకిపైగా సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది. వాటి కోసం అభిమానుల ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాల కన్నా ఆయన పర్సనల్ లైఫ్ గురించి కాస్త ఆందోళన చెందుతున్నారు అభిమానులు. నాలుగు పదులకి చేరుకున్న ప్రభాస్ ఇంకా పెళ్లి పీటలు ఎక్కకుండానే బ్యాచిలర్‌గా ఉన్నాడు. అనుష్కతో ప్రేమాయణం సాగిస్తున్నాడని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం జరుగుతున్నా దీనిపై ఓ క్లారిటీ అయితే రావడం లేదు.
ఇక తాజాగా ప్రభాస్.. యంగ్ హీరోయిన్ కృతి సనన్ తో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడని గట్టిగా ప్రచారం నడుస్తుంది.వీరిద్దరు కలిసి పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ లో కలిసి నటించిన విషయం తెలిసిందే. కృతి సనన్ – ప్రభాస్ తొలిసారిగా ఈ సినిమాతోనే కలిశారు. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యే సరికి వీరి మధ్య బంధం బలపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీ టౌన్ లోనూ చర్చించుకుంటున్నారు. ప్రభాస్ కృతితో బహిరంగంగానే చనువుగా ఉండేవారంట. అలాగే ఎక్కువ సమయం కృతితో చాట్ చేయడానికి కేటాయించారంట. గతంలో కృతి సనన్ ..ప్రభాస్ పై తన అభిప్రాయాన్ని చెప్పింది.
Prabhas in love with kriti sanon
‘డార్లింగ్ కండ్లు బాగుంటాయని, మొదట సిగ్గుపడేవాడని, చాట్ చేయడం ప్రారంభించిన తర్వాత కాస్తా మెరుగయ్యాడంది. ఆహార ప్రియుడు, సహనటులకూ స్పెషల్ గా ఫుడ్ అరెంజ్ చేయడం అంటే ఇష్టమని’ చెప్పింది. మరి ఈ లెక్కలు అన్ని చూసుకుంటూ కొందరు గాసిప్ రాయుళ్లు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, త్వరలోనే పెళ్లి పీలెక్కబోతున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ‘ఆదిపురుష్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకాచకా జరుపుకుంటోంది. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు. సైఫ్ అలీఖాన్ లంకేష్ పాత్రను పోషించారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.