Prabhas : ‘ బాహుబలి ‘ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి కి ముందు కేవలం తెలుగు సినిమాలలో నటించిన ప్రభాస్ ఈ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలితో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, సాహో సినిమాలు అంతగా హిట్ కాలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కె, ఆది పురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. ఇటీవల బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమాను మిస్ చేసుకున్నాడు.
గోపీచంద్ మలినేని రవితేజ తో ‘ డాన్ శీను ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుస ఫ్లాపులో ఉన్నా రవితేజ ఈ సినిమాతో సక్సెస్ను అందుకున్నాడు. అయితే ఈ సినిమా గోపీచంద్ ముందుగా ప్రభాస్ కు వినిపించారట. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకు వచ్చారట. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమా కథ నచ్చడంతో చేద్దామని ఓకే చెప్పాడట. కానీ ఆ వెంటనే ‘ ఏక్ నిరంజన్ ‘ సినిమా మొదలైంది. దీంతో ప్రభాస్ కాల్ షీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గోపీచంద్ ఈ కథను హీరో గోపీచంద్ కు చెప్పారు. ఈ సినిమా నచ్చినప్పటికీ గోలీమార్, వాంటెడ్ సినిమాలు చేస్తుండడంతో ఈ సినిమా చేసే వీలు కాలేదు.
ఇక గోపీచంద్ ఈ సినిమాను కథను ఆర్ఆర్ మూవీ మేకర్స్ దగ్గరకు తీసుకువెళ్లాడంతో వారి దగ్గర రవితేజ బల్క్ కాల్ షీట్లు ఖాళీగా ఉండడంతో ఆయనకు కథ చెప్పి వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించారు. 77 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేశారు. ఇలా తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అనుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలను చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రెండు హిట్లు అందుకున్న గోపీచంద్ మలినేని తన తర్వాతి ప్రాజెక్టును ఏ హీరోతో తీస్తున్నారో క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ డాన్ శీను సినిమాను మిస్ చేసుకున్నందుకు ప్రభాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.